Rbi governor suggests only gandhi photo on currency notes

rbi, reserve bank of india, raghuram rajan, rbi governor, indian currency, notes, mahatma gandhi, news about gandhi, latest news, indian famous leaders, indian freedom fight

raghuram rajan suggests only gandhi photo to be printed on indian currency notes : India has so many great persons but gandhi is top from all

గాంధీ తప్ప ఇంకెవరూ వద్దు

Posted: 08/12/2014 10:00 AM IST
Rbi governor suggests only gandhi photo on currency notes

ప్రస్తుత యాంత్రిక యుగంలో మనిషిని నడుపుతోంది కరెన్సి. ఏ పనికావాలన్నా.., ఏం చేయాలన్నా డబ్బు తప్పనిసరి. ఒకప్పుడు అవసరం అయిన డబ్బు ఇప్పుడు తప్పనిసరైంది. ఎలా సంపాదించారనే దానికంటే ఎంత సంపాదించారు అనేది అంతా చూస్తున్నారు. కోట్లు కూడబెట్టినా నోట్లపై ఉన్న మక్కువ పోదు మనిషికి. అదేమంటే అదంతే. డబ్బే వ్యక్తి బలము.., బలహీనత. అందుకే ధనమేరా అన్నిటికీ మూలం అప్పట్లోనే గొప్పగా పాట రాశారు మన తెలుగు రచయితలు. ధనం మూలం ఇదం జగత్ అని చెప్పారు కవులు. ఇంతటి ప్రాముఖ్యం ఉంది డబ్బుకు. మరి ఆ కరెన్సీ కాగితంపై ఉండే బొమ్మలు కూడా అంతే ప్రాముఖ్యం కలిగినవి ఉండాలంటున్నారు రిజర్వు బ్యాంకు గవర్నర్.

గాంధీ ఫొటో మాత్రమే కావాలి

భారతీయ కరెన్సి నోటుపై మనకు కన్పించేది మహాత్ముడి ఫొటో. మరి ఆయనతో పాటు ఇంకెవరైనా ఉంటే కూడా బాగుండు అని మీకు అన్పించిందా. మీ సంగతి అటుంచితే ఇప్పటికే చాలా మంది తమ అభిమాన నేతల ఫొటోలను నోట్లపై ముద్రించాలని పలు సందర్బాల్లో మాట బయట పెట్టారు. అన్నట్లు మన దేశంలో మహనీయులకు కొదువ లేదు. నాయకులకు లెక్కే లేదు. ప్రతి ఒక్కరూ లీడరే. నీకు నువ్వే రాజురా నిన్ను ఆపేది ఎవడురా అన్నట్లు.., ఎవరికి వారు లీడరే. ఇదే అసలు వారికి ఎసరు పెడుతోంది. చాలామంది గొప్పవారి ఫొటోలను కరెన్సి నోట్లపై ముద్రించాలని ప్రతిపాదనలు వచ్చాయి. వీటిపై రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ స్పందించారు. మన దేశ కరెన్సీ నోట్లపై గాంధీ గారు తప్ప మరెవరి ఫొటోలు ముద్రించవద్దని స్పష్టం చేశారు. దేశంలో చాలా మంది మహనీయులున్నారు.., కాదనటం లేదు. అయితే అందరికంటే మహోన్నతుడు మహాత్మాగాంధీ అని కొనియాడారు.

గాంధీ కాకుండా లేక, గాంధీతో పాటు దేశంలో ఉన్న గొప్పవారిలో ఎవరి చిత్రాన్ని ముద్రించినా దానిపై వివాదాలు జరగటం ఖాయమన్నారు. ఎందుకంటే మిగతావారంతా ప్రధానంగా రాజకీయ పార్టీలకు చెందినవారే ఉన్నారు. కాబట్టి ఒక వర్గం అంగీకరిస్తే మరొక వర్గం వ్యతిరేకించి అనవసర దుమారం రేగుతుందని చెప్పారు. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదని.., అందరి విలువలు కాపాడటంతో పాటు భారతీయత, ఇక్కడి నేతలకు ఉన్న గౌరవాన్ని పెంపొందించేందుకు ఇలా మాట్లడుతున్నట్లు సమాధానం ఇచ్చారు.

ఇందుకు ఓ ఉదాహరణ కూడా ఇచ్చారు రాజన్. దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నకు సచిన్ ఎంపిక కావటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది వాస్తవమే సచిన్ కు భారతరత్న ఇవ్వటంపై కొద్ది రోజుల పాటు వివాదం నడిచింది. కోర్టుల దాకా కూడా ఈ అంశం వెళ్ళింది. టెండుల్కర్ కంటే ముందు ప్రజలకు, దేశానికి సేవ చేసిన వారు చాలామంది ఉన్నారని వారందర్నీ వదిలి పెట్టి ఆయనకు ఇవ్వటం ఏంటని కొందరు గొడవ చేశారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gandhi  raghuram raja  rbi  inidan currency  

Other Articles