Mahendra singh dhoni will get a new record as worst captain in the world

mahendra singh dhoni, indian cricket team, indian cricket captains list, mahendra singh dhoni worst captain, mahedra singh dhoni latest news, mahedra singh dhoni news, mahendra singh dhoni new record test matches

mahendra singh dhoni will get a new record as worst captain in the world : Indian cricket captain mahedra singh dhoni will get a new record as worst captain if he lose another 3 test matches. Already he crossed indian former captains record in the column

ప్రపంచంలో చెత్త కెప్టెన్ గా ఖ్యాతి పొందిన ధోనీ!

Posted: 08/11/2014 07:09 PM IST
Mahendra singh dhoni will get a new record as worst captain in the world

(Image source from: mahendra singh dhoni will get a new record as worst captain in the world)

మహేంద్ర సింగ్ ధోనీ... మన భారత క్రికెట్ జట్టుకు లభించిన ఒక అరుదైన కెప్టెన్. ఈయన టీమిండియా కెప్టెన్ గా పగ్గాలు చేపట్టిన క్షణం నుంచి ఇప్పటివరకు అన్ని విభాగాల్లోనూ రికార్డుల మీద రికార్డులు! దాదాపు 28 ఏళ్ల తర్వాత ఇండియాకు ప్రపంచకప్ ను దక్కించిన ఘనత ఈయనకే సొంతం! అలాగే ట్వంటీ20 వరల్డ్ కప్ కూడా ఈయన సారథ్యంలోనే లభించింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మ్యాచ్ ఓడిపోతున్న తరుణంలో చివరగా క్రీజులో దిగి అద్భుతంగా గెలిపించడంలో ప్రపంచవ్యాప్తంగా కేవలం ఈ ఒక్క ఆటగాడికే సాధ్యం అవుతుంది. ఈ మాటను క్రికెట్ దిగ్గజాలు సైతం అంగీకరిస్తారు. అంతటి ఖ్యాతిని సాధించిన మహేంద్రసింగ్ ధోనీ.. ఇప్పుడు మరో చెత్త రికార్డును తన సొంతం చేసుకోవడానికి చాలా చేరువలో వున్నాడు.

ఇన్నాళ్లవరకూ టీమిండియాకు ఒక మంచి కెప్టెన్ లభించాడని అందరూ ప్రశంసల జల్లులు కురిపించగా... ఇప్పటి నుంచి చెత్త కెప్టెన్ గా ఖ్యాతిని సంపాదించబోతున్నాడు ధోనీ! ప్రస్తుతం ఇంగ్లాండుతో జరుగుతున్న టెస్టు మ్యాచుల్లో ఘోరంగా ఓడిపోయిన భారత్.. మరో మూడు మ్యాచులు ఓటమిపాలైతే.. అత్యధిక టెస్టులు ఓడిన కెప్టెన్ల జాబితాలో ధోనీ చేరిపోతాడు. ఈ జాబితాలో ముందుగా స్టీఫెన్ ఫ్లెమింగ్, బ్రియాన్ లారాలు వుండగా.. ఇప్పుడు ధోనీ కూడా ఈ జాబితాలోకి చేరుకోవడానికి సిద్ధంగా వున్నట్లు కనిపిస్తోంది. కివీస్ మాజీ సారధి ఫ్లెమింగ్, విండీస్ మాజీ కెప్టెన్ లారాలు ఇద్దరూ చెరో 16 ఓటములతో చెత్త కెప్టెన్ల జాబితాలో టాప్ ప్లేస్ లో వున్నారు. ప్రస్తుతం ధోనీ ఖాతాలో 13 ఓటములు వున్నాయి. మరో మూడు మ్యాచులు ఓడితే.. ధోనీ వారి స్థానాన్ని ఆక్రమించుకుంటాడు.

ఇదిలావుండగా.. భారత మాజీ కెప్టెన్లు అయిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ వంటి ఆటగాళ్లు టెస్టు మ్యాచుల్లో పదేసి ఓటములను తమ ఖాతాలో జమ చేసుకుని వున్నారు. ఇటీవలే న్యూజిలాండ్ పర్యటనలో సందర్భంగా మహేంద్రసింగ్ ధోనీ తన సీనియర్ల రికార్డును బ్రేక్ చేసి.. మొదటి స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. దీంతో ఇప్పటికే భారత్ లో ధోనీ అతి చెత్త కెప్టెన్ గా పేరు నమోదు చేసుకున్నాడు. ధోనీ ఒకవైపు టీమిండియాకు అరుదైన విజయాలను దక్కిస్తూనే.. మరోవైపు చెత్త రికార్డులను తెచ్చిపెట్టి భారత్ కు లెక్కలేనన్ని రికార్డులను ముట్టజెపుతున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles