Father riyaz killed his daughter boyfriend sadik in bangalore

bangalore crime news, father riyaz killed daughter boyfriend sadik, father killed daughter husband, boy escaped girl, bangalore crime story

father riyaz killed his daughter boyfriend sadik in bangalore : a story of a father who killed his minor daughter's boyfriend sadik in his sisters house in front of family members. finally he surrended himself to the police

ప్రేమగా కూతురి జీవితంలో చీకటి నింపిన తండ్రి!

Posted: 08/08/2014 01:11 PM IST
Father riyaz killed his daughter boyfriend sadik in bangalore

హాయిగా తన కోరికలను తీర్చుకుంటూ సంతోషంగా కాలం గడుపుతున్న ఒక అమ్మాయి జీవితంలో స్వతహాగా తండ్రే చీకటి నింపిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ‘‘నీ ఇష్టం.. నీకు ఏం కావాలన్ని అది ఇస్తాను.. కోరుకో’’ అని కూతురితో అప్యాయతగా పలకరించి తెచ్చివ్వడానికి సిద్ధపడే తండ్రి... పెళ్లి విషయంలో మాత్రం ఆమె జీవితంలో రాక్షసుడిగా అవతారం ఎత్తాడు. ‘‘నేను ప్రేమించిన వాడితోనే పెళ్లి చేసుకుంటాను నాన్నా’’ అని అడిగితే అందుకు ఒప్పుకోలేదు. దాంతో ఆ అమ్మాయి తన ప్రేమికుడితో కలిసి లేచిపోగా.. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ తండ్రి ప్రేమతో చేరదీసుకుని కూతురి ప్రేమ గుండెల్లో కతిపోట్లు పొడిచేశాడు. ఈ భీభత్సకరమైన ఘటన కర్నాటకలో వెలుగుచూసింది.

బెంగుళూరులోని హొంబేగౌడ మురికివాడల్లో రియాజ్ ఖాన్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతనికొక కూతురు వుంది. ఆ అమ్మాయి ఏడవ తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ బాలిక, సాదిక్ అనే అబ్బాయి గత రెండేళ్ల నుంచి సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. అయితే ఈ విషయాన్ని గమనించిన ఆ అమ్మాయి తండ్రి రియాజ్.. ఆగ్రహంతో ఆ అబ్బాయిని కలవద్దని కుమార్తెను హెచ్చరించాడు. అంతేకాదు.. తాను వుంటున్న చోటు నుంచి కేసీపురంలోని ఒక మసీదు వద్ద తన మకాం మార్చాడు. అయినా సాదిక్, తన ప్రియురాలిని కలవడానికి అక్కడికి కూడా వచ్చేవాడు. ఈ క్రమంలోనే ఆ యువకుడు జూలై 30వ తేదీన అమ్మాయిని తీసుకుని అక్కడి నుంచి హొంగదవెనహళ్లికి వెళ్లిపోయాడు. దీంతో ఆ అమ్మాయి తండ్రి కోపంతో రగిలిపోతూ వారికోసం గాలించడం మొదలుపెట్టాడు.

మరుసటి రోజు ఉదయాన్నే ఆ బాలిక తన తండ్రికి ఫోన్ చేసి.. ‘‘నేను బాగానే వున్నాను. నా గురించి పట్టించుకోకండి.. నేను సాదిక్ ను పెళ్లి చేసుకోబోతున్నాను’’ అని తెలిపింది. అంతే! కూతురు చెప్పిన మాటలు విని మండిపడ్డాడు. ఎలాగైనా వారి ఆచూకీ గురించి తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టేశాడు. వెంటనే సాదిక్ మిత్రుడు అయిన ఇర్ఫాన్ ను కలిసి అతనికి డబ్బుల ఎర చూపించి.. తన కూతురు, సాదిక్ మధ్య వున్న ప్రేమవ్యవహారం గురించి మొత్తం ఆరా తీశాడు. వారిద్దరిని ఫోన్ చేసి, తానున్న హొంబేగౌడ ప్రాంతానికి రావాల్సిందిగా కోరాడు. దీంతో, ఇర్ఫాన్ ఫోన్ చేసి సాదిక్ ను హొంబేగౌడకు పిలిచాడు.

మిత్రుడు చెప్పిన విధంగా సాదిక్ ఆ ప్రాంతానికి వచ్చాడు. అయితే అక్కడ తాను ప్రేమించిన అమ్మాయి తండ్రి రియాజ్ ను చూసి షాక్ తిన్నాడు. తనను ఏం చేస్తాడోనని భయంతో పారిపోవడానికి ప్రయత్నించగా.. రియాజ్ అతనితో మంచిగా మాట్లాడి అతని వెంట హొంగదవెనహళ్లి వెళ్లాడు. సాదిక్ అక్కడ తన సోదరి ఇంట్లోనే రియాజ్ కుమార్తెను వుంచాడు. అక్కడ తన కుమార్తెను చూసి రగిలిపోయిన రియాజ్.. ఆరోజు రాత్రి అక్కడే గడిపాడు. మరుసటిరోజు ఉదయాన్నే సాదిక్ తో కొంచెం మాట్లాడాలని చెప్పిన రియాజ్.. ఇంట్లో వున్న వాళ్లందరినీ బయటకు పంపించేశాడు. అంతే! అదే అదునుగా భావించిన అతను తన దగ్గరున్న వేటకత్తితో సాదిక్ ను విచక్షణరహితంగా నరికి చంపేశాడు. అనంతరం రియాజ్ ఇంటి నుంచి బయటకు ఏమి జరగనట్టు తాపీగా వచ్చాడు. కానీ లోపల జరిగిన ఘటనను చూసిన వారందరూ బెంబేలెత్తిపోయారు.

రియాజ్ ఆ శవాన్ని గోనెసంచిలో వేసుకుని కేఈర్ పురం పోలీస్ స్టేషన్ కు వెళ్లి తాను చేసిన పిరికితనాన్ని ఒప్పుకున్నాడు. అతని చేతిలో వున్న కత్తి, రక్తపుమరకలు చూసి పోలీసులు కూడా షాక్ తిన్నారు. దీంతో, అతనిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలావుండగా.. తండ్రి చేసిన ఈ ఘాతుకాన్ని చూసిన ఆ అమ్మాయి అక్కడి నుంచి అడ్రెస్ లేకుండా పారిపోయింది. ప్రస్తుతం ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles