Supreme court orders eamcet coucelling

supreme court latest news, supreme court eamcet councelling, supreme court telanganga sarkar, cm kcr latest news, supreme court kcr, eamcet councelling news, telangana andhra pradesh eamcet councelling

supreme court orders eamcet coucelling : supreme court orders to complete the eamcet councelling before august 31 to telangana sarkar

ఎంసెట్ కౌన్సిలింగ్ లో కేసీఆర్ కు ఝలకిచ్చిన సుప్రీం!

Posted: 08/04/2014 03:19 PM IST
Supreme court orders eamcet coucelling

ఇన్నాళ్లవరకు 1956 స్థానికత మీదే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ను కేటాయిస్తామని... ఆంధ్రా విద్యార్థులకు అస్సలు కేటాయించామని.. ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా కేవలం తెలంగాణ విద్యార్థులకు మాత్రమేనని ప్రకటిస్తూ వస్తున్న కేసీఆర్ కు సుప్రీంకోర్టు ఝలకిచ్చింది. ఎంసెట్ కౌన్సిలింగ్ కు లైన్ క్లియర్ చేస్తూ.. అడ్మిషన్లను ఆగస్టు 31వ తేదీ వరకు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహించాలని... ఉమ్మడి నిబంధనలనే ఇందులో పాటించాలని సోమవారంనాడు సుప్రీం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర విభజన ప్రభావం విద్యార్థుల భవిష్యత్ పై రాజకీయం చేయవద్దని సూచించింది.

రాష్ట్ర విభజన కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమేనని.. విభజన పేరుతో విద్యార్థులను తొలగించడం సరైన నిర్ణయం కాదని.. ఇలా చేస్తే విద్యార్థుల భవిష్యత్ తీవ్రంగా నష్టపోతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. కౌన్సెలింగ్ పొడిగింపు కోరటం సమంజసం కాదని.. విద్యార్థులకు ఫీజులు చెల్లిందవద్దనుకుంటే చెల్లించవద్దని సుప్రీం వ్యాఖ్యానించింది. దీంతో ఈ ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది హరీష్ సాల్వే అంగీకరించారు. కేసు తదుపరి విచారణను 11వ తేదీన వాయిదా వేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles