New tab screen adjusts to user eye impairment

Tab screen adjusts to eye sight, Computer screen adjusts to eye sight, No glasses screen visually impaired

New Tab screen adjusts to user eye impairment

దృష్టిదోషమున్నా పరవాలేదంటోంది కొత్త ట్యాబ్

Posted: 07/31/2014 12:16 PM IST
New tab screen adjusts to user eye impairment

కంటిలో లోపమున్నా ఏం పరవాలేదు కళ్ళజోడు కూడా పెట్టుకోనక్కర్లేదంటోంది కొత్తగా పరిశోధకులు కనిపెట్టిన ట్యాబ్ లెట్.  అటువంటి అతి స్మార్ట్ కంప్యూటర్ తో కూడా కళ్ళజోడు సాయం లేకుండా పనిచెయ్యవచ్చునట.  అందుకు కారణం ఆ సిస్టమ్ ఆల్గొరదమ్స్ ని ఉపయోగించి స్క్రీన్ తనంతట తాను తగు సర్దుబాట్లు చేసుకునేట్టుగా చేస్తుందంటున్నారు.  

సామాన్యంగా హ్రస్వ దృష్టిలోపం వస్తుంటుందని, దాని వలన దూరపు వస్తువులను చూడగలిగినా దగ్గరగా ఉన్న వాటికి అనుగుణంగా కంటిలోని లెన్స్ అడ్జస్ట్ కాలేకపోవటానికి వయసు వలన వచ్చిన ఎలాస్టిసిటీ లోపమే కారణమని చెప్తారు. దీన్ని ప్రెస్బయోపియా అంటారు.  అది ఎక్కువైతే హై ఆర్డర్ అబెర్రేషన్స్ లోకి దారితీస్తుందని అప్పుడు ఏ లెన్స్ కూడా వారి దృష్టిని సరిచెయ్యలేదని యుసి బర్క్ లీ లోని కంప్యూటర్ సైన్స్, విజన్ సైన్స్, ఆప్టిమెట్రీ ప్రొఫెసర్ బ్రియాన్ బార్స్కీ చెప్తున్నారు.

computer

డికన్వోల్యూషన్ అనే పద్ధతిలో పిన్ హోల్ లోంచి లైట్ పాస్ అయినప్పుడు చూసేవాళ్ళకి అది షార్ప్ గా కనిపిస్తుంది.  ఈ మెకానిజాన్ని ఉపయోగించి ప్రింటెడ్ పిన్ హోల్ స్క్రీన్ ని రెండు క్లియర్ ప్లాస్టిక్ లేయర్ల మధ్య శాండ్ విచ్ చేసి ఐపాడ్ మీద అమర్చటం జరుగుతోంది. 

ఈ రోజుల్లో మనం స్క్రీన్ల మీద డిస్ప్లే అయ్యే ఇమేజ్ లను చూడటం, వాటికి స్పందించటం తప్పనిసరైంది.  హైఆర్డర్ అబెర్రేషన్స్ లోకి వెళ్ళిన వాళ్ళకి కంటి కొసలు కూడా సక్రమంగా ఉండకపోవటంతో కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవటం కూడా కష్టమౌతుంది.  ప్రస్తుతం పనిచేసే ప్రతి చోట కంప్యూటర్ స్క్రీన్ ని చూడటం తప్పనిసరి.  అలాంటి వారి జీవితాలలో ఈ పరిశోధన బాగా పరివర్తన తీసుకునివస్తుందని నమ్ముతున్నానని కూడా ప్రొఫెసర్ బ్రియాన్ బార్స్కీ అన్నారు.  

యుసి బర్క్ లీ అభివృద్ధి చేసిన ఆల్గొరిదమ్స్ లో ఒక్కో పిక్సెల్ నుండి ప్రసరించే వెలుగు కిరణాల గాఢత, దిశ ఆ పరికరాన్ని ఉపయోగించే వ్యక్తి దృష్టిలోపానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటుంది. అది వాళ్ళకి బాగా కనిపిస్తుంది కానీ అదే సమయంలో వేరేవాళ్ళు చూస్తే అది వాళ్ళకి అస్పష్టమైన ఇమేజ్ ని చూపిస్తున్నట్లుగా కనిపించవచ్చు.  

దీన్నిగూడా భవిష్యత్తులో అధిగమిస్తామని అంటున్నారు పరిశోధకులు.  ఒకే స్క్రీన్ ని ఒకరికంటే ఎక్కువమంది చూస్తున్నప్పుడు కూడా అందరికీ బాగా కనిపించేవిధంగా పిక్సెల్స్ మార్పులు చేసుకునేవిధంగా స్క్రీన్ ని తయారు చెయ్యటానికి పరిశోధనలు చేస్తామంటున్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles