Masaipeta bus train accident in medak district

child girl saved 2 children in masaipeta bus-train accident, masaipeta bus accident, medak district bus train accidents, school children died in bus accident, kakatheeya school bus accident in medak district, school bus accident in medak district, bus accident victim girl ruchita interview

child girl saved 2 children in masaipeta bus-train accident in medak district

బస్సు ప్రమాదంలో ఇద్దరి ప్రాణాలను కాపాడిన చిన్నారి!

Posted: 07/28/2014 03:30 PM IST
Masaipeta bus train accident in medak district

మెదక్ జిల్లాలోని మాసాయిపేటలో ఘోరమైన బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే! అందులో దాదాపు 20మంది వరకు పిల్లలు చనిపోగా... మిగతా పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని వెంటనే ప్రమాదస్థలం నుంచి దగ్గరలోనే వున్న యశోద ఆసుపత్రికి తరలించారు సిబ్బంది! ప్రస్తుతం చికిత్స పొందుతున్న కొంతమంది చిన్నారులు వేగంగానే పుంజుకుంటున్నారని ఆసుపత్రి సిబ్బంది పేర్కొంటున్నారు. అందులో భాగంగానే అక్కడ చికిత్స పొందుతున్న ‘‘రుచిత’’ అనే అమ్మాయి ఆత్మవిశ్వాసంతో వుండటం వల్ల మిగిలివారికంటే చాలా త్వరగా కోలుకుటోందని ఆసుపత్రి సిబ్బంది చెబుతోంది.

అంతేకాదు.. ఈ అమ్మాయి చిన్నతనంలోనే సాహసవంతురాలని నిరూపించుకుంది కూడా! బస్సు ప్రమాదం జరుగుతున్న సమయంలో ఈ అమ్మాయి తనతోటి విద్యార్థులయిన ఇద్దరు చిన్నారులను కాపాడి, తాను మాత్రం తీవ్రంగా గాయాలపాలయ్యింది. ప్రమాదం జరగడానికి ముందు కొన్ని విషయాల గురించి ఆ అమ్మాయి వెల్లడిస్తూ... ‘‘బస్సులో తాను మూడు సీట్లో కూర్చున్నానని, ప్రమాదం జరగడానికి ముందు రైలు వస్తుండగా తాను చూశానని’’ ఆ అమ్మాయి పేర్కొంది. అయితే అప్పటికే బస్సు రైల్వే ట్రాక్ మీద ఆగిపోయిందని.. ఆ సమయంలోనే డ్రైవర్ కు ఫోన్ రావడంతో అతను ఆ సంభాషణల్లోనే ముగిపోయాడని చెప్పింది. రైలు వస్తోందని తాము ఎంత చెప్పినా డ్రైవర్ మాత్రం పట్టించుకోకుండా ఫోన్ లోనే మాట్లాడుకుంటూ వుండిపోయాడని ఆ అమ్మాయి వెల్లడించింది.

అయితే రైలు వస్తున్న విషయాన్ని గమనించిన తాను.. తన పక్క సీట్లో వున్న సద్భావన్, మహిపాల్ రెడ్డి అనే ఇద్దరు పిల్లలను కిటికీలోనుంచి తోసేశానని తెలిపింది. తన తమ్ముడు వరుణ్ ను కూడా కిటికీలోనుంచి తోసెయ్యడానికి ఎంత ప్రయత్నించినా.. అతడు కిటికీలో పట్టలేదని బాధతో వివరించింది. ప్రమాదం జరిగిన రోజు ఎప్పుడూ వచ్చే డ్రైవర్ పెళ్లిరోజు వుండటం వల్ల రాలేదని, అందువల్లే అతని స్థానంలో కొత్త డ్రైవర్ ను పంపారని రుచిత చెప్పింది. అతను ఫోన్ లో మాట్లాడుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆ చిన్నారి స్పష్టం చేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles