Metro cities car parking acute problem apartment disputes

Metro cities car parking acute problem, Metro cities apartment disputes, Delhi parking space shortage, car parking disputes on rise

Metro cities car parking acute problem apartment disputes: Car parking disputes on rise in Delhi and other major cities

!ప్రాణాలు తీసిన పార్కింగ్ గలాటా

Posted: 07/28/2014 11:18 AM IST
Metro cities car parking acute problem apartment disputes

నగరాలలో రోజు రోజుకీ పెరిగిపోతున్న కార్ల సంఖ్యతో పార్కింగ్ సమస్య అపార్ట్ మెంట్లలో అదనపు సమస్యే కాకుండా పెద్ద సమస్యైపోయింది.  అపార్ట్ మెంట్లలో నీళ్ళ విషయంలో, చెత్త పోయటం విషయంలో ఇలా ఎన్నో సందర్భాల్లో గొడవలు జరగటం పరిపాటే.  తాజాగా కారు పార్కింగ్ విషయంలో ఢిల్లీలో ప్రాణాలు పోవటం సంచలనం సృష్టిస్తోంది.  

అది ఢిల్లీలో వెస్ట్ పటేల్ నగర్ ప్రాంతం. ఆదివారం ఉదయం.  తీరిగ్గా ప్రశాంతంగా గడపవలసిన రోజు.  కానీ ముందురోజు నుంచే రాజుకుంటున్న కారు పార్కింగ్ సమస్య ఆ రోజు ఉదయం పెరిగిపోయింది.  గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న రాజేంద్ర భాటియా కారు గేటు దగ్గర పార్క్ చెయ్యటం తగదని సెకండ్ ఫ్లోర్ లో కొత్తగా దిగిన వాళ్ళు అభ్యంతరాలు తెల్పుతున్నారు.  కానీ 15 అడుగుల గేటున్నప్పుడు మీకేమిటి ప్రాబ్లమ్ అంటారు భాటియా.  దానితో వాగ్వివాదం కాస్తా నోటికి పరిమితమైయ్యుండకుండా చేతులు కాళ్ళకి కూడా పని చెప్పింది.  ఆ దాడిలో భాటియా అక్కడికక్కడే మృతి చెందటం జరిగింది.

పోలీసులు సెకండ్ ఫ్లోర్ లోని కార్తిక్ తోపాటు ధర్మేందర్, ఓబరాయ్ లను కల్పబుల్ హోమిసైడ్ కింద అరెస్ట్ చేసారు.  

తండ్రితో మాట్లాడటానికి వచ్చామని కార్తిక్, మరో ఇద్దరు అనటంతో ఆదివారం ఉదయం గేటు తీసిన భాటియా కుటుంబం బయట 25 నుంచి 30 మంది వరకు ఉండటం చూసామని, లోపలికి వస్తూనే కార్తిక్, అశోక్ ఓబరాయ్ అనే ప్రాపర్టీ డీలర్ కలిసి తండ్రి మీద పిడిగుద్దులు గుద్దారని దానితో ఆయన మరణించారని చెప్పారు భాటియా కుమారుడు మోక్షిత్ అన్నాడు.  

ఘటన జరిగిన తర్వాత చూస్తే ఇంత చిన్న దానికి ప్రాణాలు తీసేంత వరకు పోవాలా అనిపిస్తుంది.  కానీ ఆ సమయంలో ఓపిక నశించటమే ఇలాంటి అనర్థాలకు దారితీస్తుంది.  కారు డ్రైవ్ చేస్తుంటే ఎదుటి వాళ్ళు తప్పుకుని సైడ్ ఇవ్వలేదని, ముందలి కారు ఓవర్ టేక్ చెయ్యనివ్వటం లేదని, ఇలాంటి విషయాల్లో సహనాన్ని కోల్పోవటం తరచూ చూస్తూనేవుంటాం.  దానికి కారణం, కారు ఖరీదు, దానివలన వాళ్ళకి పెరిగిందని వాళ్ళు అనుకునే ప్రతిష్ట, ఎంతో వేగంగా వెళ్ళగలిగిన కారు వేగాన్ని నిరోధించినందుకు ఆగ్రహం, ఇలా ఎన్నో విషయాలు వాళ్ళల్లోని అహంకారాని పదునుపెట్టి
ఎదుటివాళ్ళతో తలపడేట్టుగా చేస్తుంటుంది.  

పై సంఘటనలో ప్రాణాలు పోయినవాళ్ళ కుటుంబమే కాదు ప్రాణాలు తీసినివారి జీవితం కూడా నాశనమౌతోంది కదా.  కొద్దిపాటి సహనం ప్రదర్శించివుంటే రెండు కుటుంబాలను ఈ పరిస్థితి నుంచి తప్పించివుండేది కదా.

కొంతకాలం క్రితం ఇన్ని వాహనాలు లేనప్పుడు డిజైన్ చేసిన నివాసాల వలన వాటికి కేటాయించిన స్థలం తక్కువైవుండటం సహజం.  అలాంటప్పుడే ఒకరి నొకరు అర్థం చేసుకుని పరస్పర సహకారంతో నడుచుకోవలసిన అవసరం ఉంది.  ఇలాంటి ఘటనలు ఢిల్లీలో ఈ మధ్య కాలంలోనే చాలా ఎక్కువైపోవటం అధికారులను, నగరవాసులను కలతపెడుతోంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles