Fees reimbursement scheme changed telangana sarkar smart scheme

Telangana sarkar smart scheme, Fees reimbursement scheme, Telangana nativity issue, 1956 cut off fees reimbursement, Telangana Fees reimbursement scheme

Fees reimbursement scheme changed to Telangana sarkar smart scheme for students fees reimbursement to students in professional studies

మా పట్టు విడవం అంటున్న సర్కార్ స్మార్ట్

Posted: 07/28/2014 10:29 AM IST
Fees reimbursement scheme changed telangana sarkar smart scheme

ఫీజు రియంబర్స్ మెంట్ పేరు మార్చి తెలంగాణా సర్కార్ స్మార్ట్ అని చేసినా మళ్ళీ అక్కడికే వచ్చింది విషయం.  1956 కి ముందునుంచే తెలంగాణాలో ఉన్న విద్యార్థులకే అది వర్తిస్తుందని పట్టుబట్టి కూర్చుంది తెలంగాణా సర్కార్.  దానితో స్థానికతకు అది కొలమానం కాదు కదా అనే వాదనకైతే తెరపడుతోంది.  ఎందుకంటే స్థానికత అనటం లేదు.  తెలంగాణా ప్రభుత్వం కొందరు విద్యార్థులకు ఆర్థిక సాయం చెయ్యదలచుకుంది.  అందుకు ప్రమాణంగా 1956 సంవత్సరాన్ని తీసుకుని దానికి ముందునుంచే తెలంగాణాలో ఉన్నవాళ్ళకే ఫీజు రాయితీ ఇస్తామంటోంది.  దానికి ఎవరూ వంకపెట్టటానికి వీల్లేదని తెలంగాణా ప్రభుత్వం ఉద్దేశ్యం.  

కానీ తెరమీదకు వచ్చిన మరో అంశం ఏమిటంటే ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం వలన తెలంగాణాలోని కొన్ని జిల్లాలకు చెందిన విద్యార్థులకు ఈ లబ్ధి అందదు.  ఈ విషయాన్ని వివరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రావెల కిషోర్, ఈ నిర్ణయం వలన ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ జిల్లాలలో కొన్ని ప్రాంతాలు అప్పడు తెలంగాణాలో లేవని, మద్రాస్ ప్రాంతంలో ఉండేవని, అందువలన ఆ ప్రాంతపు తెలంగాణా విద్యార్థులు నాన్ లోకల్స్ అయిపోతారా అని రావెల ప్రశ్నిస్తున్నారు.  

అయితే కఠినమైన నిర్ణయాలను తీసుకుంటామని కెసిఆర్ ముందుగానే చెప్పారు.  నేరస్తులు ఎంతమంది తప్పించుకున్నా పరవాలేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడగూడదన్నట్లుగా కేవలం తెలంగాణా విద్యార్థులకే మేం ఆర్థిక సాయం చేస్తాం అంటూ పట్టుబట్టి కూర్చున్న ప్రభుత్వాన్ని ఇలాంటి విమర్శలు, కొత్త కొత్త పాయింట్లూ ఏమాత్రం కదిలించలేవు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles