Trs and bjp differ on reservations to muslim minorities

TRS and BJP differ on reservations to Muslims, KCR promises reservations to Muslims, KCR Ramjan gift to Muslims reservation

TRS and BJP differ on reservations to Muslim minorities

రిజర్వేషన్ల మీద తెరాస భాజపాల మధ్య విభేదం

Posted: 07/19/2014 10:09 AM IST
Trs and bjp differ on reservations to muslim minorities

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ముస్లిం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని మాటివ్వటం మీద భారతీయ జనతా పార్టీ వ్యతిరేకతను చూపిస్తోంది.  

మత పరమైన రిజర్వేషన్లు మంచిది కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వాదిస్తున్నారు.  దీని మీద హైద్రాబాద్ ఎల్ బి నగర్ లో ధర్నాను కూడా నిర్వహించారు.  

అయితే తను ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటానని కెసిఆర్ గట్టిగా చెప్తున్నారు.  రంజాన్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న కెసిఆర్ ఆ తర్వాత ప్రసంగిస్తూ తను ఇచ్చిన 12 శాతం రిజర్వేషన్ ని తప్పక అమలు చేస్తానని మాటిచ్చారు.  క్యాబినెట్ సమావేశం కూడా దీన్ని ఆమోదించటం జరిగింది.  

మతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు ప్రభుత్వం సాయం చెయ్యవచ్చుకానీ మత ప్రాతిపదికన రిజర్వేషన్ల విధానం సరైనది కాదని కిషన్ రెడ్డి అంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles