Telangana cm kcr fires on polavaram ordinance approval and narendra modi

telangana cm kcr fires on polavaram ordinance approval and narendra modi, telangana cm kcr, telangana cm kcr latest news, telangana cm kcr news, telangana cm kcr fires on narendra modi, kcr fires on narendra modi, telangana comments on polavaram ordinance bill approval, polavaram ordinance in lok sabha, kcr with narendra modi

telangana cm kcr fires on polavaram ordinance approval and narendra modi

మోడీసాబ్.. ఇక చూసుకుందాం! కేసీఆర్

Posted: 07/11/2014 05:37 PM IST
Telangana cm kcr fires on polavaram ordinance approval and narendra modi

(Image source from: telangana cm kcr fires on polavaram ordinance approval and narendra modi)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న బీజేపీ పార్టీతో కాంగ్రెస్ తో పోల్చుతూ నోటికొచ్చినట్టు తిట్టిన కేసీఆర్... ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. ‘‘మోడీ సాబ్...! ఇంతవరకు మీరు ఆడిందే ఆట.. పాడిందే పాట అంటూ నిర్ణయాలు తీసుకుంటే చప్పుడు చేయకుండా గప్ చుప్ గా వున్నాం... ఇక నుంచి అలా సాగదు... తాడోపేడో తేల్చుకోవాల్సిందే’’నన్న ధోరణితో మోడీ మీద గుర్రుగా వున్నట్టు రాజకీయ వర్గాలు తెలుపుతున్నాయి.

పోలవరం ఆర్డినెన్స్ లోక్ సభలో శుక్రవారంరోజు ఆమోదం పొందిన విషయం తెలిసిందే! ఆ ఆమోదంతో ఖమ్మం జిల్లాలో వుండే ఏడు ముంపు మండలాలు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలవనున్నాయి. అంటే దాదాపు 500 కంటే ఎక్కువ గ్రామాలే ఆంధ్రాలో భాగం కాబోతున్నాయి. బిల్లు ఆమోదానికి ప్రతిపక్ష నేతలు, టీఆర్ఎస్ ఎంపీలు, ఇంకా తదితర ఎంపీలు కూడా లోక్ సభలో వ్యతిరేకంగా నినాదాలు చేసినా... మెజారిటీ సభ్యులు మద్దతు తెలిపడంతో ఆమోదం పొందింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ నేతలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ బిల్లు ఆమోదంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందంటూ వ్యాఖ్యానించిన ఆయన... కేంద్రం తెలంగాణాకు చాలా అన్యాయం చేస్తోందని చెప్పారు. అలాగే పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలుపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరికాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ... పోలవరం ఆర్డినెన్స్ పై కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. లోక్ సభలో అందరూ ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా అభ్యంతరం వ్యక్తం చేసినా... బిల్లును ఎలా ఆమోదించారు..? పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో ఎలా కలుపుతారని ఆయన ఆవేశంగా మండిపడ్డారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై త్వరలోనే న్యాయనిపుణులతో కలిసి చర్చలు జరుపుతామని ఆయన అన్నారు.

తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలో వుండే ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సూచిస్తానని ఆయన తెలిపారు. ఒకవేళ రాష్ట్రపతి నిర్ణయాన్ని కూడా కేంద్రం అడ్డుకుంటే... అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఆయన సవాల్ విసిరారు. పైగా అటు రైల్వే బడ్జెట్ లోనూ, కేంద్ర బడ్జెట్ లోనూ తమ తెలంగాణా రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం జరిగిందని పేర్కొన్న ఆయన... ఆయా విషయాలపై కూడా రాష్ట్రపతితో చర్చిస్తామని ఆయన తెలిపారు. మొత్తంగా కేసీఆర్ ఇప్పుడు మోడీతో అమీతుమికి దిగుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారని రాజకీయవర్గాల్లో గుసగుసలు సాగుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles