Two air ports in hyderabad says telangana cm kcr

two air ports in hyderabad, telangana cm kcr, KCR, telangana, air ports, hyderabad, two air ports in hyderabad says telangana, cm kcr.

two air ports in hyderabad says telangana cm kcr

నగరంలో మరో రెండు ఎయిర్‌పోర్టులు!

Posted: 07/07/2014 05:21 PM IST
Two air ports in hyderabad says telangana cm kcr

హైదరాబాద్ నగరం మరో రెండు కొత్త ఎయిర్ పోర్టులతో.. సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే ఇంటర్ నేషనల్ రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు ఉన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొత్త నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో సర్పంచ్ నుంచి ఎంపీ వరకూ అందర్నీ భాగస్వామ్యం చేయాలన్నారు.ఇప్పటికే నెలరోజుల పాటు అన్ని శాఖలపై సమీక్ష జరిపానని తెలిపారు. అయినా కూడా ఏం చేశారని కొందరు విమర్శిస్తున్నారన్నారు.

మరో నెల రోజుల పాటు ఇలానే ఉంటానని కేసీఆర్ తెలిపారు.ఆయన.. హైదరాబాద్ లో వ్యవస్థ సక్రమంగా లేదన్నారు. ప్రస్తుతం నగరంలోని వ్యవస్థను సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌లో 10 డంప్ యార్డ్‌లు ఏర్పాటుచేస్తామని, ఇందులో భాగంగానే జిల్లాలో జాయింట్ కలెక్టర్ల సంఖ్య పెంచుతామన్నారు.

రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను కూడా దశల వారీగా పెంచుతామన్నారు. త్వరలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకూ అందరికీ శిక్షణా తరగతులు ఇచ్చి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామన్నారు. వెయ్యికోట్లతో మైనర్ ఇరిగేషన్‌ను అభివృద్ధిపరుస్తామన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ రాజకీయాలకు కేంద్రంగా మారుతోందని, దానిని సమూలంగా మారుస్తామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో విద్యుత్ కొరత ఉన్న కారణంగా 6వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సిన అవసరం తమపై ఉందన్నారు..

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles