Rs 32 per day in villages rs 47 in cities

Rs 32 Per Day in Villages Rs 47 In Cities, New Poverty Line, poverty line, rangarajan committee, 32 per day in villages, 47 per day in cities.

Rs 32 Per Day in Villages Rs 47 In Cities

33 రూపాయలు ఉంటే మీరు కోటీశ్వరులే?

Posted: 07/07/2014 04:07 PM IST
Rs 32 per day in villages rs 47 in cities

కాంగ్రెస్ ప్రభుత్వం లో.. పేదవాడికి 600 వంద రూపాయలు ఉంటే చాలు నెల మొత్తం బతికేయవచ్చునని కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత చెప్పటం జరిగింది. ఇప్పుడు మాత్రం పేదవాడికి 33 రూపాయలు సంపాదిస్తే చాలు కోటీశ్వర్లు అయిపోయినట్టే. పేదవారితో ప్రతి రాజకీయనాయకుడికి చులకనగా మాట్లాడటం అలవాటు అయ్యింది. రూపాయికి విలువ లేని రోజులు ఇవి. డాలర్ మన రూపాయిపై పెత్తనం చేస్తున్న రోజులు. అలాంటి కేవలం 33 రూపాయాలతో పేదవాడు ఎలా బతుకుతాడు.

నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ బియ్యం ధర 30 రూపాయలు దాటిపోయింది. ప్రభుత్వం పథకం కింద అందించే నీరు కూడా 2 రూపాయలైపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా గ్రామాల్లో రోజుకు 33 రూపాయలు, నగరాల్లో 47 రూపాయలు ఖర్చు పెట్టేవారంతా ధనికులేనని కేంద్రానికి నిపుణుల కమిటీ ఒకటి సూచించింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఇది పెను దుమారమే లేపింది.

Rs-32-Per-Day-in-Villages -Rs-47-In-Cities

అధికార, విపక్ష నేతలంగా నిపుణుల నివేదికపై అభ్యంతరం చెబుతున్నారు. సాక్షాత్తూ కేంద్ర మంత్రులే దీనిపై మండిపడుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థిక వేత్త రంగరాజన్ నేతృత్వంలోని కమిటీ ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు పేదవారే అని స్పష్టం చేయగా, ఈ కమిటీ రోజుకి 33 రూపాయలు ఖర్చు చేస్తే పేదలుకాదని తేల్చింది.

ఈ లెక్కన పేదలు కానివారంతా ఆహారానికి, విద్యకు, ఆరోగ్యానికి తగినంత సంపద కలిగి ఉన్నారని నిపుణులు కమిటీ స్పష్టం చేస్తోంది. దీనిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రంగరాజన్ కమిటీ రోజుకు 100 రూపాయలు ఇచ్చి ఎలా బతకాలో నేర్పాలని నిపుణుల కమిటీని ప్రశ్నించిందని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి.

సీపీఎం సీనియర్ నాయకుడు సీతారాం ఏచూరి, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు నరేష్ అగర్వాల్ కూడా ఈ లెక్కలను ఖండించారు. రంగరాజన్ కు తాము రోజుకు వంద రూపాయలు ఇచ్చి, పల్లెలో ఎలా బతకాలో చూపించమంటామని అగర్వాల్ అన్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles