Recruitment in telangana police

recruitment in telangana police, 6000 constables to be appointed in telangana, 500 sis to be recruited in telangana, 3620 police drivers to be recruited in telangana, kcr decision to strengthen police department

recruitment in telangana police

తెలంగాణా పోలీస్ శాఖలో భర్తీలు

Posted: 07/01/2014 03:11 PM IST
Recruitment in telangana police

తెలంగాణాలో పోలీస్ శాఖను బలోపేతం చేసే దిశగా తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు 6000 మంది కాన్ స్టబుల్స్, 500 మంది ఎస్సై పోస్ట్ లను భర్తీ చెయ్యటానికి ఆదేశాలిచ్చారు.

దానితో డిజిపి కార్యాలయం అందుకు కావలసిన తయారీలలోపడింది.  అన్ని జిల్లాల ఎస్పీల నుంచి నివేదిక తెప్పించుకున్న డిజిపి, మొదటి విడతలోనే 6000 మంది కాన్ స్టబుల్స్ ని, 500 మంది ఎస్సైల నియామకానికి రిక్రూట్ మెంట్ బోర్డు కి పంపించటం జరిగింది.  

హోంగార్డ్ ల నియామకాల కోసం కూడా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతుండటంతో, దానితోపాటు డ్రైవర్ల కొరత కూడా ఉండటంతో, దాని గురించి కూడా ఆలోచన చెయ్యమని ప్రభుత్వాన్ని కోరుతూ, ఈ నియామకాలన్నిటినీ ఒకేసారి చేపట్టాలని పోలీస్ శాఖ ఆలోచిస్తోంది.  

డ్రైవర్ల విషయంలో కూడా సానుకూలంగా స్పందించిన కెసిఆర్ 3260 మంది డ్రైవర్ల నియామకానికి కూడా అంగీకారం తెల్పటంతో తెలంగాణా నిరుద్యోగులకు ఆశలు చిగురించాయి.  ముఖ్యమంత్రవుతూనే ఒక్కో సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్న కెసిఆర్ పట్ల యువతలో నమ్మకం పెరిగిపోతోంది.  అలాగే పోలీసు శాఖలో సిబ్బందిని పెంచటం ద్వారా జంటనగరాలలో రక్షణ సమస్య కూడా అంతరించే అవకాశం కనిపిస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles