Gail gas pipe line blast

gail gas pipe line blast, gas line blast in east godavari, ongc negligence in blast in east godavari, gas spread for one km caught fire in eg dist

gail gas pipe line blast

పచ్చటి కోనసీమలో చిచ్చు ఎలా రేగింది?

Posted: 06/27/2014 05:46 PM IST
Gail gas pipe line blast

గ్యాస్ అంటుకుంటే దాన్ని ఆర్పటం ఎవరి తరమూ కాదు.  ఫైర్ ఫైటింగ్ సిబ్బంది ఆ మంటలు వ్యాపించకుండా చూడగలరేమో అంతే కానీ అర్పివేయటం సాధ్యం కాని పని.  లీక్ అయిన గ్యాస్ అంతా కాలిపోతేనే ప్రమాదం తప్పినట్లు.  అదంతా కాలిపోవాలి, ఇంకా గ్యాస్ బయటకు రాకూడదు, అప్పుడే ప్రమాదం పూర్తిగా తప్పిపోయినట్లు.  

వంటింట్లో గ్యాస్ లీకైవున్న సమయంలో అగ్గిపుల్ల గీస్తే ఎలాగైతే అంటుకుంటుందో అలాగే నగరం గ్రామంలో ఉదయం టీ దుకాణంలో టీ తయారు చెయ్యటం కోసం అగ్గిపుల్ల వెలిగించగానే ఎకరం మేర వ్యాపించిన గ్యాస్ భగ్గుమంది.  ఆ మంటల్లో సజీవదహమైనవారికి మృత్యువు ఏ కారణంగా సంభవించిందో తెలిసేంత వ్యవధి ఇవ్వలేదు.  

గ్యాస్ పైప్ లైన్ లకు దరిదాపులలోకి ఎవరూ పోరు.  ఎందుకంటే వాటి మీద చెయి వేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కనుక.  ఇప్పుడు ఇంత మారణహోమం జరిగినందుకు ఎవరి మీద కఠిన చర్యలు తీసుకుంటారో చూడాలి.  

ఈ విషయంలో మాజీ ఎంపి హర్షకుమార్ మాట్లాడుతూ తుప్పు పట్టిన పైపులను మార్చమని స్థానికులు చెప్పినా అధికారులు పట్టించుకోలేదని, తగు సమయంలో చర్య తీసుకునివుంటే ఈ దుర్ఘటన జరిగివుండేది కాదని అన్నారు.  

ఉదయం ఆరు గంటలకు అగ్గిపుల్ల వెలిగించి ఉండకపోతే గ్యాస్ మరింత దూరం వరకు వ్యాపించివుండేది.  అగ్గిపుల్ల వెలుగుకి కాలిపోబట్టే వ్యాపించిన గ్యాస్ అంతా తరిగిపోయింది.

పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టిన గెయిల్ అధికారులు గ్యాస్ లీకవుతున్నదని నెలరోజులుగా స్థానికులు చేసిన ఫిర్యాదులను పట్టించుకోకపోవటం, మంటలు అంటుకున్నప్పుడు ఫోన్ చేస్తే కూడా వాళ్ళ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి కూర్చోవటం స్థానికులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.  

ఇది మొదటిసారి కూడా కాదు.  గ్యాస్ లీకై అగ్ని ప్రమాదాలు జరగటం 1993, 1995, 2005 లో కూడా సంభవించిందని, 1995లో అయితే మంటలను పూర్తిగా ఆర్పటానికి 65 రోజులు పట్టిందని స్థానికులు గుర్తుచేసుకున్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles