(Image source from: Errabelli Dayakar Rao told the importance of chandrababu in telangana)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ గెలుపొంది, అధికారాన్ని చేజిక్కించుకున్న తెలుగుదేశం పార్టీ... తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పార్టీకి ధీటుగా నిలబడలేక ఘోర పరాజయం పాలయ్యింది. బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ... కేవలం 15 అసెంబ్లీ సీట్లతో మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కూడా తెదేపా పార్టీ నేతల ప్రసంగలు కూడా అంతంత మాత్రంగానే వున్నాయి. ఇక కాంగ్రెస్ పరిస్థితి అయితే మరీ దారుణంగా మారిపోయింది. కాంగ్రెస్ విషయం పక్కనబెడితే... ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ గెలవడం వల్ల తెలంగాణలో వున్న తెదేపా మంత్రులు కాస్తవరకు ఊపిరి పీల్చుకుంటున్నారు.
తాజాగా తెదేపా శాసనసభా పక్ష నేత అయిన ఎర్రబెల్లి దయాకరరావు... తెలంగాణలో తమ నాయకుడు చంద్రబాబునాయుడు లేని లోటు గురించి వివరిస్తూ... ‘‘తెలంగాణా అభివృద్ధి కావాలంటే అందుకు బాబు అవసరం చాలా వుంది. హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి ఎదగడానికి కారణం కూడా ఆయనే! అలాగే తెలంగాణాలోని మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలంటే బాబు సహకారం ఎంతో అవసరం’’ అని పేర్కొన్నారు.
ఓఎంసీ కేసు సందర్భంగా అనంతపురం జిల్లాలోని రాయదుర్గం కోర్టు వాయిదాకు హాజరయిన ఎర్రబెల్లి దయాకరరావు... మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన డ్వాక్రా, రుణాలను మాఫీ చేసే పథకాలను తెలంగాణాలో కూడా అమలు చేయాలి. అప్పుడే పేదప్రజలపై వున్న రుణాల భారం తగ్గుతుంది’’ అని చెప్పారు. అలాగే... ‘‘తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఎక్కువగా వున్నప్పటికీ... కేసీఆర్ ప్రభుత్వం రైతుల రుణమాఫీలు చేయడానికి వెనుకంజ వేస్తోంది. కేసీఆర్ అభివృద్ధికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నారు’’ అని నిందలు వేశారు.
చివరగా... ‘‘ఆంధ్రరాష్ట్రంలో బాబు చేస్తున్న పనులను, ఆయన అందిస్తున్న పథకాలను, ఆయన నడుస్తున్న బాటను తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలి’’ అని సూచించారు. చివరగా ఆయన తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడులాంటి నాయకుడు ఎంతో అవసరం అని పేర్కొంటూ... తెలంగాణలో ఆయన లోటును గుర్తు చేసుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more