Ex cm kiran kumar reddy may join bjp party

ex cm kiran kumar reddy may join bjp party, kiran kumar reddy may join bjp party, kiran kumar reddy may join bjp

ex cm kiran kumar reddy may join bjp party

కిరణ్ జీవితంలోకి పెద్ద పువ్వు వెలుగులు?

Posted: 06/17/2014 11:29 AM IST
Ex cm kiran kumar reddy may join bjp party

కిరణ్ కుమార్ రెడ్డి ఈ పేరు తెలుగు ప్రజలకు, రాజకీయ నేతలకు బాగా పరిచయం. గతంలో చిత్తూరు కిరణాలు రాష్ట్రంలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. చిత్తూరు కిరణాల వేడి దెబ్బకు ..కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు సైతం నిద్రపట్టని రాత్రులు గడిపినట్లు ఆ పార్టీ సీనియర్ నేతలు అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు.

రాష్ట్రం విడిపోతున్న సమయంలో.. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఆఖరి బంతి వరకు పోరాడి ఘోరంగా ఓడిపోయిన పీలేరు మగధీరుడు. తెలంగాణ నేతలకు పట్టపగలు చుక్కలు చూపించి, అసెంబ్లీ సాక్షిగా రెచ్చిపోయిన సీమాంద్ర రాజకీయ నేత. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే సంకల్పంతో తెలంగాణ గడ్డపై.. అలుపెరగని సమరం సాగించిన.. పీలేరు పోటుగాడు. సమైక్య పడవ ముగిపోతుందన్న విషయం తెలిసి కూడా.. పట్టుదలకుండా.. జోడు చెప్పులతో తెలుగు ప్రజలకు మద్యకు వెళ్లి .అతి ఘోరంగా ఓటమి అనే గోతిలో పడిపోయాడు.

అయితే ఒంటరి పోరాటం అతి తక్కువ సేపు ఉంటుందని చాలా లేటుగా తెలుసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి, అతి త్వరగానే రాజకీయ తెర వెనకకు వెళ్లిపోవటం జరిగింది. కానీ నిన్నటి వరకు కింగ్ లా వెలిగిన కిరణాలు.. ఇప్పుడు రాష్ట్రంలో కనిపించటకపోవటంతో.. ఆయన అభిమానులు ఆందోళనలో పడ్డారు. అయితే ఆయన ముఖ్య సన్నిహితులు..కొన్ని రాజకీయ సూచనలు ఇవ్వటంతో పీలేరు పిల్లాగాడు..మనసు మార్చుకొని , పెద్ద పువ్వు (బిజేపి ) వైపు ఆశగా చూస్తున్నట్లు తెలుస్తోంది.

తన జీవితంలోకి మళ్లీ రాజకీయ వెలుగులు రావలంటే.. పెద్ద పువ్వు వల్లే జరుగుతుందని గ్రహించి వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద పువ్వు నేతలతో ..తన సోదరుడు సాయంతో.. మంతనాలు జరుగుపుతున్నట్లు రాజకీవర్గాలు అంటున్నాయి. మొదట చిత్తూరు సార్ కి కొంచెం సిగ్గుగా ఉన్నప్పటికి..తన సన్నిహితులు సర్థిచెప్పటంతో.. పెద్దపువ్వు పై పిలేరు పిల్లాగాడు మనసుపడినట్లు తెలుస్తోంది.

అయితే మన రాష్ట్రానికి చెందిన పెద్ద పువ్వు నేతలతో కాకుండా, గుజరాత్, కర్ణాటకలకు చెందిన బీజేపి నేతల ద్వారా రాజకీయ మంతనాలు జరిపించి, బిజేపిలో చేరేందుకు సిద్దమైనట్లు ..బిజేపిలోని సీనియర్ నాయకులు అంటున్నారు. మళ్లీ తెలుగు ప్రజలకు.. చిత్తూరు కిరణాలు తాకే అవకాశం ఉందని ఆయన అభిమానులు అంటున్నారు.

అయితే ఈ విషయం నాయుడికి తెలియటంతో పార్టీలో కొంచెం రచ్చ జరిగినట్లు పెద్ద పువ్వు కార్యకర్తలు అంటున్నారు. కానీ చిత్తూరు సార్ మాత్రం .. సమైక్యాంద్ర కోసం పెట్టిన పార్టీని చంకలో పెట్టుకొని, తన చెప్పుల జోడును మూలకు నెట్టి, పెద్ద పువ్వు కోసం పరుగులు తీస్తున్నాడు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద పువ్వుతో.. మళ్లీ తెలుగు ప్రజల మద్య వస్తే .. రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles