Telangana associations demand closure of tv9

Telangana associations demand closure of TV9, Telagana CM KCR objects TV 9 objectionable comments on MLAs, TV 9 comments on CM and Telangana MLAs

Telangana associations demand closure of TV9

టివి 9 కార్యాలయాన్ని మూసివేయాలని డిమాండ్

Posted: 06/16/2014 12:10 PM IST
Telangana associations demand closure of tv9

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, ఇతర ఎమ్మెల్యేల మీద టివి 9 చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఆ ఛానెల్ ని మూసివేయాలనే డిమాండ్ చేస్తున్నాయి కొన్ని తెలంగాణా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

తెలంగాణా రాష్ట్ర సమితి బ్రాహ్మణ సంఘం, టివి 9 కార్యాలయాన్ని హైద్రాబాద్ నుంచి తొలగించాలని ఆదివారం నాడు ఆందోళన చేసారు.  తెలంగాణా అడ్వకేట్ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఆందోళనలో పాలుపంచుకుని ఈ విషయంలో టివి-9 బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరింది.  నగరంలోంచి టివి-9 కార్యాలయాన్ని ఎత్తివేయకపోతే మరోసారి ఆందోళన చేస్తామని కూడా వాళ్ళు హెచ్చరించారు.

టివి-9 వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ వర్కింగా జర్నలిస్ట్ ఫెడరేషన్ కూడా టివి9 వ్యాఖ్యలను ఖండించింది.  ఫెడేరేషన జనరల్ సెక్రటరీ జి.ఆంజనేయులు మాట్లాడుతూ, ప్రజా ప్రతినిదుల పట్ల అవాంఛనీయమైన వ్యాఖ్యలు చేసిన టివి 9 ని వైఖరిని ఖండిస్తూ, అసలే మీడియా విలువలు పడిపోతున్నాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో టివి 9 అభ్యంతరకరమైన వ్యాఖ్యలు దురదృష్టమని అన్నారు.   టివి 9 ఇప్పటికే క్షమాపణ చెప్పింది కానీ ఈ లోపులోనే మిడియాకి జరగరాని నష్టం జరిగిందని ఆంజనేయులు అన్నారు.  

టూరింగ్ టాకీస్ లలో సినిమా చూసేవారిని మల్టీప్లెక్స్ లో కూర్చోబెడితే ఎలా ఉంటుందో తెలంగాణా శాసనసభ అలా ఉందని టివి 9 వ్యాఖ్యానించింది.  పాచికల్లు తాగిన ముఖాలని కూడా చెప్పటం జరిగింది.  దీనిమీద కుపితులైన తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో టివి 9 వైఖరిని ఖండిస్తూ, గౌరవనీయులైన శాసన సభ్యులను అగౌరవంగా మాట్లాడటానికి ఎంత ధైర్యం, తమిళనాడులో జయలలిత చేసినట్లుగా కేబుల్ చట్టాలను అమలు పరుస్తామని అన్నారు.  

ఆంధ్రజ్యోతి రాతల మీద కూడా కెసిఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.  ఆంధ్రా మీడియా ఇక్కడ లేని సమస్యలను లేవదీసి అడగోలు రాతలు రాస్తోందని కెసిఆర్ అన్నారు.

అనుచిత వ్యాఖ్యలు చేసిన టివి 9 శాసనసభను క్షమాపణ కోరుతూ, జరిగినదానికి చింతిస్తున్నామని, ఇకపై అటువంటి పొరపాట్లు జరగవని హామీ ఇచ్చింది.  కాంగ్రెస్ ఎమ్మల్యే జీవన్ రెడ్డి కూడా శాసనసభలో ఈ విషయంలో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టాలని శాసనసభలో అన్నారు.  

వ్యక్తిగత ధూషణ ఎవరూ చెయ్యగూడదు- రాజకీయాలలో కూడా అని భావిస్తున్న సమయంలో సత్యాలను ప్రజలకు అందించే పని పెట్టుకున్న న్యూస్ మీడియా ఆ పని అసలే చెయ్యగూడదు.  ప్రజాప్రతినిధుల ముఖాల మీద వ్యాఖ్యానం చెయ్యటమంటే ప్రజలందరినీ చేసినట్లే.  ఇలాంటి వ్యాఖ్యల వలన మొత్తం మీడియాకే అప్రతిష్ట సంభవించే అవకాశం ఉంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles