Chandrababu naidu bumper offer to seemandhra people

chandrababu bumper offer to seemandhra people, Seemandhra a Singapore, Çhandrababu Naidu, AP Cabinet meeting, M Relief Fund and the donor, 100 per cent tax exemption.

chandrababu naidu bumper offer to seemandhra people, CM Relief Fund and the donor could get a 100 per cent tax exemption.

బాబు ను కలిస్తే ..100 శాతం పన్ను రాయితీ ఫ్రీ?

Posted: 06/13/2014 10:45 AM IST
Chandrababu naidu bumper offer to seemandhra people

మీకు పన్ను రాయితీ కావాలంటే.. వెంటనే.. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని కలవండి? తప్పకుండా మీకు పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ షరతులు వర్తిస్తాయి. తమిళనాడు జయమ్మ, పశ్చిమ బెంగాల్ మమతమ్మల బాటలో.. చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.

ఈ ఇంటికి మా పార్టీ జెండ రంగు వేసుకుంటే చాలు..మీకు అన్ని రాయితీలు లభిస్తాయని మమతా బెనర్జీ . మీకు ఇంటిల్లో నా ఉప్పునే వాడండి? మీకు అంత మంచే జరుగుతుందని తమిళనాడు జయమ్మ, తమ రాష్ట్ర ప్రజకలు బంఫర్ ఆఫర్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వారి బాటలోనే.. మన చంద్రాలు సారు, ఆంద్రప్రదేశ్ ప్రజలకు చక్కని బంఫర్ ఇవ్వటం జరిగింది.

రాష్ట్ర విభజనతో రాజధాని రాజ్యంగా లో హైటెక్ రాజుగా చంద్రబాబు నాయుడు ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన తమ రాజధాని నిర్మించుకోవటానికి.. రాత్రి, పగలు అనే తేడా లేకుండా, చందమామ కలలు కంటూ, చిన్న, పెద్ద అని భేదం లేకుండా.. సీమాంద్ర ప్రజలకు బంఫర్ ఆఫర్ ఇవ్వటం జరిగింది. రాజధానిని కోల్పోయిన అవశేష ఆంద్రప్రదేశ్ ను పునాది నుంచి నిర్మించుకనేందుకు ప్రజలు తప్పక సహకరించాలని కోరటం జరిగింది.

ఎపిస్టేట్ న్యూ కేపిటల్ కోసం అందే విరాళాలకు నూరు శాతం పన్ను మినహాయింపు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చంద్రబాబు చెప్పారు. ఎపిస్టేట్ న్యూ కేపిటల్ డెవలప్‌మెంట్ ఫండ్ లేదా సిఎం రిలీఫ్ ఫండ్ పేరిట విరాళాలు పంపవచ్చని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశిస్తున్నారని, హైదరాబాద్‌ను మించి అన్ని హంగులతో నూతన రాజధాని నిర్మాణం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

Chandrababu-s-bumper-offer-seemandhra-people

అసలే అన్నం లేక ..అల్లో రామచంద్ర అని ఏడుస్తుంటే, తెల్ల చొక్క కావాలని గోల చేసాడట? అనే విధంగా చంద్రబాబు ఆలోచన ఉందని అంటున్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత.. కేంద్రం సీమాంద్రా కొన్ని రాయితీలు ఇస్తుంది. మనకు ఆదాయం లేదని తెలుసు, విరాళాలు అయితే.. ఏదో తులమో, ఫలమో దాచిపెట్టుకున్న పైసల్ ఇస్తాం. కానీ 100 శాతం పన్ను రాయితీ తగ్గించుకొని సంపాదన ..సీమాంద్ర ప్రజలు సంపాదించుకోవాలి కదా. అసలు సంపాదనే లేనప్పుడు.. ఇక పన్నులు ఎలా కడతారు.

అయినా రాజధాని మీద ఇష్టపడి, మనసుపడి, విరాళం ఇస్తారు గానీ, ఇలా 100 శాతం రాయితీ కోసం ఆశపడి విరాళం ఇస్తే , అది స్వార్థం అవుతుంది. రాజధాని కోసం విరాళం అడగటంలో తప్పులేదు. ఇలా ప్రజల మనోభావాలు దెబ్బ తినే విధంగా.. ఆఫర్ ఇచ్చి అడిగితే. పాత కష్టాలు మళ్లీ పార్టీ తలుపులను తడతాయి. సీమాంద్ర ప్రజలు మనసున్న మహానుభావులు .. మనది అనుకుంటే చాలు.. రాజధాని కోసం నిలుపు దోపిడి ఇచ్చే పుణ్యమూర్తులు చాలా మంది ఉన్నారు. బాబు గారు ఆఫర్లు ఇచ్చి విరాళలు అడిగి.. ఆంద్ర ప్రజల మనసులను గాయం చేయద్దని టిడిపి కార్యకర్తలు, తెలుగు ప్రజలు కోరుతున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles