Babu negotiating with microsoft to develop it in ap

Babu negotiating with Microsoft to develop IT in AP, Chandrababu Naidu talks to AP CM Chandrababu Naidu, Satya Nadella Microsoft,

Babu negotiating with Microsoft to develop IT in AP

మైక్రోసాఫ్ట్ తో ఆంధ్రప్రదేశ్ లో ఐటి అభివృద్ధికి నాంది

Posted: 06/12/2014 08:53 AM IST
Babu negotiating with microsoft to develop it in ap

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ లో అత్యున్నత హోదాలో పనిచేస్తున్న ఆంధ్రుడి పేరు ఎత్తారు.  ఆయన పేరు సత్య నాదెళ్ళ.  సత్య నాదెళ్ళతో తనకు గల సన్నిహత సంబంధాన్ని తెలియజేసారు చంద్రబాబు.  ఆంధ్రప్రదేశ్ ను కూడా ఐటి రంగంలో తీర్చి దిద్దటానికి అంతకంటే మంచి అవకాశం ఇంకేముంటుంది.  

చంద్రబాబు సత్యనాదెళ్ళతో సంప్రదించినట్లుగానూ త్వరలోనే మైక్రోసాఫ్ట్ శాఖ ఒకటి ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పటానికి ఒప్పందాలు జరుగుతున్నాయి.  మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు ఆంధ్రప్రదేశ్ కి వచ్చాయీ అంటే ఇక మిగతా సంస్థలు కూడా క్యూకట్టేస్తాయి.  ఈ సంగతి బాగా తెలిసిన చంద్రబాబు హైద్రాబాద్ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ లోనే ఐటి ని అభివృద్ధి చెయ్యటానికి తొలి అడుగులు వేస్తున్నారు.

గతంలో కూడా చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ సంస్థాపకుడు బిల్ గేట్స్ ని కలిసి హైద్రాబాద్ లో ఐటి అభివృద్ధికి పాటుపడ్డారు.  హైద్రాబాద్ కి బిల్ గేట్స్ ని తీసుకునివచ్చిన ఘనత ఆయనకే దక్కింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles