Us magazines appreciate modi fashionable attire

US magazines appreciate Modi fashionable attire, Modi Kurta trade mark US magazines comment, Narendra Modi fashionable after Michel Obama

US magazines appreciate Modi fashionable attire

మోదీ ఫ్యాషన్ ని కీర్తించిన యుఎస్ పత్రికలు!

Posted: 06/07/2014 05:53 PM IST
Us magazines appreciate modi fashionable attire

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యధిక మెజారిటీతో భారతదేశ అధికారాన్ని సునాయాసంగా చేపట్టటం విషయంలోనే కాకుండా వేసుకునే దుస్తులను అనుసరించే ఫ్యాషన్ ని కూడా మూడు ప్రముఖ అమెరికన్ పత్రికలు- టైమ్స్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ లు పొగడ్తలతో ముంచెత్తాయి.   

మోదీ వేసుకునే కుర్తాను శ్లాఘిస్తూ అది ఆయన ట్రేడ్ మార్క్ గా గొప్ప నాయకుడు పాటించవలసిన వేషధారణగా టైమ్స్ పత్రిక పేర్కొంది.  అటు రాజకీయంగానూ, ఇటు వ్యక్తిగత విధానాలలోను ఆయన రాణించారని ఆ పత్రికలు రాసాయి.  ఒబామా సతీమణి మిచెల్ ఒబామా కూడా అలాగే చక్కటి ఫ్యాషనబుల్ దుస్తులతో కనపడతారు.  ఆమె తర్వాత మళ్ళీ మోదీయేనంటూ ఆ పత్రికలు మళ్ళీ అమెరికాను గౌరవాన్నితక్కువ చెయ్యకుండా జాగ్రత్తగా రాసాయి.  
భారత దేశ మొట్టమొదటి ప్రధాన మంత్రి కూడా దుస్తులు, మేనరిజం లలో అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు.  అయితే ఆయన ప్రసంగాలకంటే మోదీ ప్రసంగాలు ఇంకా ప్రభావితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు.  నెహ్రూ కి స్వాతంత్ర పోరాట యోధుడిగా కూడా పేరుండటం వలన అదనపు హోదాగా ఆయనకి గౌరవాన్నిచ్చారు.  మరో తేడా ఏమిటంతే, ధనిక కుటుంబంలో పుట్టిన నెహ్రూ అంతర్జాతీయంగా కూడా ఆధునిక పోకడలను కూడా బాగా తెలిసిన వ్యక్తి.  కానీ మోదీ పేదరికం నుంచి వచ్చినా తన దుస్తులతో వ్యవహార శైలితో అంతర్జాతీయ ఖ్యాతిని గడించటం గొప్ప విషయం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles