Special status to andhra pradesh declared by center

Special status to Andhra Pradesh declared by Center, Special status to AP for 5 years,

Special status to Andhra Pradesh declared by Center

కేంద్రం నుంచి ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా ప్రకటన

Posted: 06/03/2014 04:20 PM IST
Special status to andhra pradesh declared by center

తెలంగాణా విడిపోయిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను ఖరారు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.  

ఈ ప్రత్యేక హోదా జూన్ 8 న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి 5 సంవత్సరాల కాలం వరకు అమలులో ఉంటుంది.

ఫిబ్రవరి 20 న అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీ మేరకు మార్చి 1న కేంద్ర హోం శాఖ  సంబంధిత నోట్ ని తయారు చెయ్యగా, యుపిఏ ప్రభుత్వంలో మార్చి 2 న కేంద్ర క్యాబినెట్ రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదాని ప్రకటించింది.  

ఆ తర్వాత ఆ ఆదేశాలు ప్లానింగ్ కమిటీకి చేరింది.  ఇంతలో ఎన్నికల నియమావళి అమలులోకి రాగా ప్లానింగ్ కమిషన్ దగ్గరే ఉత్తర్వులు నిలిచిపోయాయి.  ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ పూర్తై తెలంగాణా రాష్ట ఆవిర్భావ ప్రకటన కూడా అయిపోవటంతో ఆ ఉత్తర్వులు తిరిగి ప్లానింగ్ కమిషన్ నుంచి వెలువడుతున్నాయి.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles