No place to bandaru dattatreya in modi cabinet team

Bandaru Dattatreya in Modi cabinet, No Place to Bandaru Dattatreya in Modi Cabinet, enior BJP leader Bandaru Dattatreya, Telangana MP in Team Modi, Atal Bihari Vajpayee government.

No Place to Bandaru Dattatreya in Modi Cabinet Team, Not a single Telangana MP in Team Modi,

కేంద్రంలో దత్తా త్రేయను తొక్కేసారు?

Posted: 05/27/2014 08:06 AM IST
No place to bandaru dattatreya in modi cabinet team

రాజకీయ నాయకుల మద్య ఎప్పుడు ఏమీ జరుగుతుందో ఎవరు చెప్పలేరు. నిన్నటి వరకు శత్రువులుగా ఉన్న వారు వెంటనే కలిసిపోయి .. కౌలిగించుకొని .. ముద్దులు పెట్టుకుంటూ.. ఐ లవ్ యు చెప్పుకున్న నేతలు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయను కేంద్రంలో తొక్కేసినట్లు మరోసారి రుజువైంది.

సికింద్రాబాద్ నియోజక వర్గం నుంచి నాలుగోసారి లోక్‌సభకు ఎన్నికైన దత్తాత్రేయకు మోడీ మంత్రివర్గంలో చోటు లభిస్తుందన్న ప్రచారం జోరుగా జరిగింది. బిజెపి అభ్యర్థిగా తెలంగాణ నుంచి దత్తాత్రేయ ఒక్కరే లోక్‌సభకు ఎన్నికవడంతో కేంద్రంలో ఆయనకు మంత్రి పదవి ఖాయమని చాలా మంది అంచనాలు వేశారు. అయితే మోదీ మంత్రివర్గంలో దత్తాత్రేయకు చోటు లభించకపోవడంతో ఈ అంచనాలన్నీ పటాపంచలయ్యాయి.

బిజెపిలోని ఒక వర్గం చివరి క్షణంలో చక్రం తిప్పి దత్తన్నకు మంత్రి పదవి రాకుండా అడ్డుకోగలిగిందన్న ప్రచారం బలంగా సాగుతోంది. ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారో అంతుపట్టటం లేదని దత్తాత్రేయ సానుభూతిపరులు వాపోతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో దత్తన్నకు టికెట్ రాకుండా అడ్డుకునేందుకు బిజెపిలోని ఒక వర్గం చివరి వరకూ విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం దత్తన్నకు మంత్రి పదవి దక్కకపోవడం వెనుక బడా నాయకులు తమ వంతు పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఒక వర్గానికి చెందిన బలమైన నాయకుల కుట్ర వల్లనే రాష్ట్రం నుంచి వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారికి ప్రమోషన్ లభించకుండా పోయిందన్నది బహిరంగ రహస్యం. దత్తన్న విషయంలో ఇది రుజువైంది.

గతంలో వాజ్‌పేయి స్వయంగా దత్తాత్రేయకు ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రావలసిందిగా ఆహ్వానించారు. అప్పటి రాష్టప్రతి కలామ్‌కు దత్తాత్రేయతో పాటు మరో ఇద్దరి పేర్లు పంపి మూడు కుర్చీలు కూడా వేశారు. అయితే చివరి క్షణంలో దత్తాత్రేయ పేరు మాయమైంది.

ఆతర్వాత దత్తాత్రేయతో మాట్లాడిన వాజ్‌పేయి ఆయనకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా స్వతంత్ర హోదా ఇచ్చిన విషయం తెలిసిందే. స్వతహాగా మృదు స్వభావి ఆయిన దత్తాత్రేయ పదవులు దక్కించుకోవటానికి అనుసరించవలసిన వ్యూహాలను వంటబట్టించుకోకపోవడం వల్లనే ప్రస్తుతం మంత్రి పదవి లభించలేదేమోనన్న భావన కలుగుతోంది. రెండో విడతలోనైన దత్తన్న పై మోడీ వర్షం కురుస్తుందో లేదో చూడాలి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles