Elec employees jac asks officers cooperation

Elec employees JAC asks Officers cooperation, Electricity employees striking in AP, JAC wants Goverrnor's interference in strike

Elec employees JAC asks Officers cooperation to call off strike

సమ్మె విరమణకు సహకరించమని అధికారులను కోరిన ఐకాస

Posted: 05/26/2014 12:30 PM IST
Elec employees jac asks officers cooperation

ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన చర్చలు కూడా విఫలమై అధికారులు మొండివైఖరిని ప్రదర్శిస్తున్నారని, సమ్మె విరమణ చెయ్యటం కోసం అధికారులు సానుకూలంగా వ్యవహరించవలసివుంటుందని విద్యుతుద్యోగుల ఐకాస తెలియజేసింది.  

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలంలో 14 గ్రామాలలో విద్యత్ సరఫరా ఉదయం 3.00 గంటల నుంచి నిలిచిపోయివుంది.  ఈదురు గాలుల కారణంగా అంతరాయం ఏర్పడ్డ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించటానికి వీల్లేకుండా విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో ఆ గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారు.  

ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకుని పరిస్థితిని అనుకూలంగా తీసుకుని రావాలని, అందుకు అందరూ సహకరిస్తేనే సమ్మె విరమణ చెయ్యటం సాధ్యమౌతుందని విద్యుతుద్యోగుల ఐకాస అంటోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles