Narendra modi 14th pm

Narendra Modi 14th PM, Modi swearing in as 14th PM on 26th, Modi 15th PM if Gulzari Lal Nanda is counted

Narendra Modi 14th PM

మోదీ 14వ ప్రధానా, 15వ ప్రధానా?

Posted: 05/21/2014 01:08 PM IST
Narendra modi 14th pm

చాలా వరకు మీడియాలో నరేంద్ర మోదీని 14 వ ప్రధాన మంత్రిగానే వ్యవహరిస్తున్నారు.  కానీ కొన్ని వెబ్ సైట్లు మాత్రం 15 వ ప్రధాన మంత్రిగా పేర్కొంటున్నాయి.  వీటిలో ఏది సరైన సంఖ్య?

భారతదేశ ప్రధానమంత్రులుగా పనిచేసినవారిలో గుల్జారీ లాల్ నందా కూడా ఉన్నారు.  ఆయన రెండుసార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసారు.  స్వతంత్ర భారతంలో మొట్టమొదటి ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రూ మరణించినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యటానికి మధ్యలో ఒకసారి, లాల్ బహదూర్ శాస్త్రి మరణించినప్పుడు ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యటానికి మధ్యలో మరోసారి గుల్జారీ లాల్ నందా తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించారు.  ఆయనను ప్రధానమంత్రులలో కలపకపోతే మోదీ 14 వ ప్రధానమంత్రి అవుతారు, కలిపితే 15 వ ప్రధానమంత్రి అవుతారు.  

భారతదేశ ప్రధాన మంత్రులు వీరు-

1. జవహార్ లాల్ నెహ్రూ దాదాపు 17 సంవత్సరాలు ఏకధాటిగా ప్రధానమంత్రిగా పనిచేసారు.  
2. గుల్జారీ లాల్ నందా రెండుసార్లు తాత్కాలిక ప్రధాన మంత్రిగా పనిచేసారు.  రెండు సార్లు కలిపినా కూడా పట్టుమని పాతిక రోజులే ఆయన ప్రధానిగా వ్యవహరించిన కాలం.
3. లాల్ బహాదూర్ శాస్త్రి రెండు సంవత్సరాలు పనిచేసారు.
4. ఇందిరా గాంధీ- నెహ్రూ తర్వాత ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసారు.  ఒకసారి 11 సంవత్సరాలు వరుసగా, మరోసారి నాలుగు సంవత్సరాలు పనిచేసారు.  
5. మొరార్జీ దేశాయ్ రెండు సంవత్సరాలు పనిచేసారు.
6. చరణ్ సింగ్ కేవలం ఆరు నెలల కాలం ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు.  
7. రాజీవ్ గాంధీ ఐదు సంవత్సరాలు ప్రధానిగా వ్యవహరించారు.
8. విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ కేవలం ఒక సంవత్సర కాలం ప్రధాని పదవిలో ఉన్నారు.
9. చంద్రశేఖర్ 8 నెలల కాలం ప్రధాని పదవిలో పనిచేసారు.
10. పి.వి.నరసింహారావు 5 సంవత్సరాలు ప్రధానిగా పనిచేసారు.
11. అటల్ బిహారీ వాజ్ పేయ్ రెండు సార్లు ప్రధాన మంత్రిగా వ్యవహరించారు.  మొదటిసారి కేవలం 15 రోజులే కానీ రెండవసారి 6 సంవత్సరాలు పనిచేసారు.
12. హెచ్ డి దేవగౌడ 10 నెలలు ప్రధానమంత్రిగా పనిచేసారు.
13. ఐకె గుజ్రాల్ 8 నెలలు పనిచేసారు.
14. డాక్టర్ మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు- పూర్తిగా రెండు టెర్మ్ లలో ప్రధానమంత్రగా పనిచేసారు.
15. నరేంద్రమోదీ 26 న ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నారు.

ఇలా చూస్తే మోదీ 15 వ ప్రధానమంత్రి, కానీ గుల్జారీ లాల్ నందాని లెక్కలోకి తీసుకోకపోతే 14 వ ప్రధాని అవుతారు.

స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత దేశాన్ని ఇంత వరకు నెహ్రూ సంతతివారు పాలించిన కాలం- 33 సంవత్సరాలు.  చాలా మంది భావిస్తున్నట్లుగా పరోక్షంగా పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ లను ప్రధాన మంత్రిగా నిలబెట్టి పాలించిన కాలం 15 సంవత్సరాలు.  అంటే 67 సంవత్సరాలలో 48 సంవత్సరాలు నెహ్రూ గాంధీ సంతతివారి కనుసన్నలలోనే దేశం నడిచింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles