తెలంగాణ ఉద్యమ ఛాంపియన్ కల నేరవేరింది. 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేశామన్న ధీమతో మొట్ట మొదటి సారిగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దక్కించుకున్నారు. నాలుగు కోట్ల ప్రజల మనసు తెలుసుకోని, 14 సంవత్సరాలు పాటు ఏలాంటి రాజకీయ పదవి ఆశించకుండా, తెలంగాణ ప్రజల లక్ష్యం కోసం రేయింబవళ్లు కష్టపడి.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుండు మన కేసిఆర్ అన్న.
ప్రత్యేక తెలంగాణ కోసం.. ఎంత మంది విద్యార్థులు బలిదానాలు అర్పించారు. ఆ అమరవీరుల ఫలితమే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. నాలుగు కోట్ల మంది ప్రజలను, నాలుగు రకాల మనసుల కలిగిన వ్యక్తులను ఒక తాటిపై తెచ్చి, తెలంగాణ కోసం ఉద్యమం సాగించాడు మన కేసిఆర్. ఫామ్ హౌస్ లో ఉన్న, పార్లమెంట్ లో ఉన్న .. ఆయన ద్వేయం ఒక్కటే. తెలంగాణ ప్రజల కలను సాకారం చేయాలన్న పట్టుదలతో.. 14 సంవత్సరాల పాటు రాజకీయ పదవులకు దూరంగా ఉండటం జరిగింది.
తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ‘‘తెలంగాణ రాష్ట్ర సమితి’’. 2001లో ఒక్కరితో మొదలైన టీఆర్ఎస్ పార్టీ నేడు.. జాతీయ పార్టీలకు దీటుగా ఎదిగింది. లోకల్ పార్టీగా తెలంగాణ లో పుట్టి, ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. కేసిఆర్ అపర చాణుక్యుడు, మాటల మాత్రింకుడు, క్షణాల్లో రణరంగం స్రుష్టించగలడు.. అదే సేకనులోనే ప్రశాంత వాతవరణం నింపగల సామర్థ్యం ఉన్న ఏకైక వ్యక్తి ఒక్క కేసిఆర్.
తెలంగాణ ప్రజలు కేసిఆర్ ముఖ్యమంత్రి కావాలనే పూజలు, యగాల ఫలితమే.. ఈరోజు ఆయన్ని ముఖ్యమంత్రిని చేశాయి. తెలంగాణ ప్రజలకు ఆయన కు పట్టం కట్టారు. యువ నాయకులతో, తలపండిన సీనియర్ రాజకీయ నాయకులతో కలిసి పని చేయగల సామర్థ్యం ఆయనలో పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి గా కేసిఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
అలాగే తెలంగాణ రాష్ట్రం సాధించిన వీరుడుగా ఆయన్నే చెప్పుకుంటారు. కేసిఆర్ లో మంచి , చేడు ఉన్నాయి. మంచి వారికి ఆయన మంచి నాయకుడిగా, చెడ్డవారికి, చెడ్డ నేతగా కనిపిస్తారు. కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం ఆయన దేవుడిగా కనిపిస్తారు. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని ఆయనకు కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు.
తెలంగాణ లో అఖండ విజయం సాదించిన టీఆర్ఎస్ పార్టీ పై తెలంగాణ ప్రజలు పూర్తి విశ్వసంతో ఉన్నారు. తెలంగాణ ప్రజలు మంచి రోజులు వచ్చాయిని, తెలంగాణ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉన్నదని , తెలంగాణ తల్లలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసిఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రం అభివ్రుద్ది చెందాలని తెలంగాణ యువత కోరుకుంటుంది. ముఖ్యంగా .. తెలంగాణ రైతులు.. కేసిఆర్ పై.. కొండంత ఆశ పెట్టుకున్నారు. తెలంగాణ రైతుల కన్నీరు తుడిసే నాయకుడు మన కేసిఆర్ అని వారు నమ్ముతున్నారు.
మన తెలంగాణ , మన తెలంగాణ రాష్ట్రం, మన తెలంగాణ ప్రాంతం, మన తెలంగాణ భాష, యాస, మన తెలంగాణ పత్రిక, మన తెలంగాణ పార్టీ, మన తెలంగాణ ప్రజలు, మన తెలంగాణ అభివ్రుది.. మన తెలంగాణ యువత భవిష్యత్తే మనకు ముఖ్యం అన్నకేసిఆర్ మాటలను నిజం చేయాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.
జై తెలంగాణ, జై కేసిఆర్, జై టీఆర్ఎస్, జై ఉద్యమ వీరులు, అమరవీరులకు జై.. అమర వీరుల తల్లులకు జై..
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more