Former ap cm nedurumalli passes away

Former AP CM Nedurumalli passes away, Nedurumalli Janardan Reddy passed away, Nedurumalli Janardan Reddy died, Former AP Chief Minister Nedurumalli

Former AP CM Nedurumalli passes away

నేదురుమల్లి జనార్దన రెడ్డి కన్నుమూత

Posted: 05/09/2014 09:25 AM IST
Former ap cm nedurumalli passes away

మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి గత కొంతకాలంగా కాలేయం వ్యాధులతో బాధపడుతూ నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.  ఈరోజు ఉదయం ఆయన హాస్పిటల్ లోనే కన్నుమూసారు.

పై పాత ఫోటోలో నేదురుమల్లి, ఆయన భార్య రాజ్యలక్ష్మి

ఫిబ్రవరి 20, 1935 లో నెల్లూరు జిల్లా వాకాడు ల జన్మించిన నేదురుమల్లి జనార్దన రెడ్డి 1972 లో రాజకీయ రంగంలోకి వచ్చారు.  

రాష్ట్ర ప్రభుత్వంలో- 1978- 1983 మధ్య విద్యుత్ వ్యవసాయ శాఖకు, 1989-90 లో వ్యవసాయ శాఖ, అటవీ శాఖ, ఉన్నత విద్యా శాఖలకు మంత్రిగా పనిచేసారు.  

1990 నుంచి 1992 వరకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసారు.  

కేంద్ర ప్రభుత్వంలో- 1998-99 లో బాపట్ల నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు.  1999 లో నరసరావుపేట స్థానం నుంచి ఎంపీగాను, 2004లో విశాఖపట్నం స్థానం నుంచి ఎంపీగాను ఎన్నికైన నేదురుమల్లి 2009 లో రాజ్యసభకు ఎంపికయ్యారు.  

నేదురుమల్లి భార్య రాజ్యలక్ష్మి, నలుగురు కుమారులు రామ్ కుమార్ రెడ్డి, అశోక్ కుమార్ రెడ్డి, గౌతమ్ రెడ్డి, భరత్ రెడ్డి లను వదిలి అనంతలోకాలకు వెళ్ళిపోయారు.

తన రాజకీయ జీవితమంతా కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తూ గడిపిన నేదురుమల్లి మరణవార్త విని ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి.  పలు రాజకీయనాయకులు ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని వెలిబుచ్చారు.  సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని సోమాజిగూడా లోని ఆయన నివాసానికి తరలించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles