70 percent in the market is halal meat

70 percent in the market is Halal meat, Halal meat and Jhatka meat, Muslim ritual halal meat, Punjab Jhatka meat

70 percent in the market is Halal meat

బజార్లో దొరికేదంతా హలాల్ చేసిన మాంసమే

Posted: 05/08/2014 02:25 PM IST
70 percent in the market is halal meat

ఈ కాలంలో మాంసాహారుల శాతమే ఎక్కువ.  అందులోను చేపలు, కోడి కంటే మేక, గొర్రెల మాంసమే ఎక్కువ ఖరీదైనది.  ఈ మాంసం తయారీకి జంతు వధ చేసేటప్పుడు ముసల్మానుల హలాల్ పద్ధతిలోనే చేస్తారు.  ఎందుకంటే ముసల్మానులు అలా చేసిన మాంసాన్నే భుజిస్తారు.  కానీ ఇతరులు దేన్నైనా తింటారు కాబట్టి.  

పంజాబ్ లో ఝట్కా మీట్ ని కూడా ఎక్కువగా వినియోగిస్తారు.  హలాల్ కి, ఝట్కాకి తేడాలున్నాయి.  హలాల్ లో ముస్లిం ఆచారం ప్రకారం ముందు ప్రార్థన చేసి కొద్దిగా కోసి వదిలేస్తారు.  దాని వలన దానిలోని రక్తం మాంసానికి ఎక్కువగా పట్టి మాగుతుంది.   ఝట్కా లో ఒకే వేటులో జంతువు తలను వేరు చేస్తారు.   పైగా అందులో ఎటువంటి మతాచారాలనూ అనుసరించరు.  పంజాబ్, ఢిల్లీ, హర్యానా ప్రాంతంలో మాత్రం రెండు రకాల మాంసాలు విడివిడిగా లభిస్తాయి.  కానీ ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా హలాల్ మాత్రమే ఉండటానికి మరో కారణం మాంసం విక్రేతలంతా ముసల్మానులు కావటమే.  

Indian-mutton-jhatka

మనదేశంలో కెఎఫ్ సి, సబ్ వే, డైమండ్ పిజ్జా లలో వాడే మటన్ చికెన్ అన్నీ హలాల్ చేసినవే.  కొన్ని కంపెనీలు ఈ విషయంలో మాట్లాడటానికి ఇష్టపడటం లేదంటే అవీ హలాల్ నే ఉపయోగిస్తున్నాయనుకోవచ్చు.  

ముసల్మానులు కానివారికి ఎటువంటి మాంసమనే పట్టింపూ లేదు, చాలా మందికి ఆ తేడా కూడా తెలియదు కాబట్టి హలాల్ ని ఉపయోగిస్తే అందరికీ పనికివస్తుందన్నది వారి ఆలోచన.  

విదేశాలలో విక్రయిస్తున్న మాంసంలో కూడా హలాల్ ని ఉపయోగించటానికి కారణం అది మిగిలినవాటికంటే తక్కువ ధరకు వస్తుండటం వలన.  ఉదాహరణకు న్యూజిలాండ్ లో సూపర్ మార్కెట్లలో దొరికే మేక మాంసంలో 70 శాతం హలాల చేసిందే.  కానీ ఆవిషయాన్ని వెల్లడి చెయ్యకపోవటమే వాళ్ళు చేస్తున్నది.  వినియోగదారుడికి ఇచ్చే మాంసం ఎటువంటిదన్నది దాని ప్యాకింగ్ మీద రాసుండాలి కదా అంటారు న్యూజిలాండ్ మాంసం వినియోగదారులు.  పిజ్జా ఎక్స్ ప్రెస్ ఉపయోగించే చికెన్ కూడా హలాల్ చేసిందే.  ఆ విషయాన్ని వెబ్ సైట్ లో మాత్రం ఆ సంస్థ ప్రకటించింది.

pizza-express

సాధారణంగా జంతువధ్య శాలల్లో ముందుగా జంతువులను ఎలక్ట్రిక్ షాక్ తో కానీ మరే విధానంలోనైనా కానీ స్పృహ పొయేట్టుగా చేస్తారు.   దానితో వాటికి బాధ తెలియదు.  కానీ చాలా ముస్లిం దేశాలలో జంతువులను వధించే ముందు అవి స్పృహకోల్పోయేట్టుగా చెయ్యటం జరగదు.  అందువలన ఇది క్రూరమైన విధానమని అలా చెయ్యటం తగదని యూరప్ లో దీని మీద ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఆవేదన వ్యక్తం చెయ్యగా, హలాల్ చేసే జంతువులను ముందుగా స్పృహపోయేట్టుగా చెయ్యాలంటూ యూరప్ లోని ముస్లిం లీడర్లు పిలుపునిచ్చారు.

ఒకవేళ జంతువులను ముందుగా స్పహ లేకుండా చేసి ఆ తర్వాత వధించినట్లయితే అటువంటి మటన్ మీద హలాల్ అని ప్రత్యేకంగా ప్రకటించాల్సిన అవసరం లేదని బ్రిటిష్ కన్సోర్టియమ్ తెలియజేసింది.  బ్రిటిష్ వెటరినరీ అసోసియేషన్ మాంసపు ప్యాక్ ల మీద వాటిని వధించేముందు స్పృహ పోగొట్టి చేసారా లేదా అన్నది ప్రకటించాలనే కొత్త విధానాన్ని ప్రతిపాదిస్తూ లక్ష సంతకాల సేకరణతో దీని మీద పార్లమెంటులో చర్చకు కూడా తీసుకునిరానున్నారు.

మత విశ్వాసాలను పక్కకు పెడితే హలాల్ విధానం చాలా శాస్త్రీయమైనదని, సురక్షితమని అందువలన దీన్ని ముస్లిం మతస్తుల మీద అస్త్రంగా వాడటానికి ఉపయోగించరాదని చెప్పిన బ్రిటన్ ముస్లిం కౌన్సిల్ డెప్యూటి జనరల్ సెక్రటరీ, దీని వలన ప్రజలలో అనవసరమైన సందేహాలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

జంతువులకు మత్తు మందు ఇచ్చికానీ కరెంట్ షాక్ తో కాని స్పృహ పోగొట్టటమనేది లేదు సరికదా భారత దేశంలో చాలా చోట్ల అది హలాలే కానీ ఝట్కాయే కానీ ఒక జంతువు చూస్తుండగానే మరో జంతువుని వధించే సన్నివేశాలు కనిపిస్తాయి.  వధించేటప్పుడు బాధపడేది ఒక జంతువైతే, సాటి జంతువుని వధించటం చూసి తరువాతది తన వంతే కదా అని లోలోపలే కుమిలిపోయేయి కొన్ని ఉంటాయి, కట్టలు తెంచుకుని బయటపడదామని ప్రయత్నించేవి మరి కొన్ని వుంటాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles