Tdp cadre vs ysrcp cadre election fight in hindupuram

tdp cadre vs ysrcp cadre, ysrcp cadre election fight, balakrishna election campaign, balakrishna election speech, hindupuram mla candidate balakrishna, election 2014, may 7th seemandhra election, may16th election results, ysr congress party election camp, election 2014, seemandhra election 2014.

tdp cadre vs ysrcp cadre election fight in hindupuram

బాలయ్య వెళ్లటంతోనే కొట్టుకున్నారు?

Posted: 05/06/2014 08:12 AM IST
Tdp cadre vs ysrcp cadre election fight in hindupuram

సినీ హీరో, హిందూపురం అసెంబ్లీ స్థానానికి టిడిపి అభ్యర్థి నందమూరి బాలకృష్ణ గంగటిపల్లెలో ఎన్నికల ప్రచారం ముగించుకొని తిరిగివెళుతున్నారు. టిడిపి కార్యకర్తలు రోడ్డుదాకా ఆయన్ను అనుసరించారు. అదేసమయంలో హిందూపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత రోడ్ షోలో పాల్గొనడానికి వాహనాన్ని అద్దెకు తీసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు తమ వాహనానికి దారి ఇవ్వమని టిడిపి కార్యకర్తలను కోరారు.

దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గందరగోళం మధ్య కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు టిడిపి కార్యకర్తలకు చెప్పులు చూపించారు. దానికి బదులుగా టిడిపి కార్యకర్తలు వారిని దూషించారు. ఇరు వర్గాలు పరస్పరం రాళ్ళ దాడికి దిగాయి. దాడిలో కొందరు టిడిపి కార్యకర్తలు గాయపడ్డారు.

అనంతరం టిడిపి కార్యకర్త ఫిర్యాదు మేరకు లేపాక్షి పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా పోలీసులు గ్రామంలో బందోబస్తు చేశారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles