Telangana jac pawan kalyan style

Telangana JAC Pawan Kalyan style, Prof Kodandaram, TJAC rejects TDP and YSRCP in elections, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Telangana JAC Pawan Kalyan style, Prof Kodandaram, TJAC rejects TDP and YSRCP in elections

పవన్ కళ్యాణ్ శైలిలో తెలంగాణా ఐకాస?

Posted: 04/18/2014 03:37 PM IST
Telangana jac pawan kalyan style

ఈరోజు తెలంగాణా ఐక్య కార్యాచరణ సమితి విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

తెలంగాణా ఎన్జీవో కార్యాలయంలో తెలంగాణా ఐకాస ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.  ఐకాస నియమావళిని త్వరలోనే ప్రకటిస్తామని చెప్తూ, తెలుగు దేశం పార్టీ, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలను ఎన్నికలలో తిరస్కరిస్తున్నామని అన్నారు.  అంటే ఆ రెండు పార్టీలకు వోట్లు వెయ్యరాదని తెఐకాస నుంచి వోటర్లకు సందేశం వెళ్తోంది. 

రాజకీయాలలో ఎటువంటి క్రియాశీల పాత్రనూ పోషించనని ముందునుంచీ చెప్తున్న కోదండరామ్ వాచ్ డాగ్ లా పనిచేస్తామని మాత్రం చెప్తున్నారు.  వైకాపా బాహాటంగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి పనిచేసింది కాబట్టి ఆ పార్టీని తిరస్కరించారు కానీ రెండు ప్రాంతాలూ సమానమని, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి అభ్యంతరం లేదని చెప్పిన తెదేపాను ఎందుకు తిరస్కరించారన్నది ఇప్పుడు తెలియజేయలేదు.  కానీ అంతకు ముందు తెలంగాణా రాష్ట్ర సమితి తరఫున స్థానిక ఎన్నికలకు సీట్లు లభించని ఐకాస కార్యకర్తల విషయంలో మాట్లాడుతున్నప్పుడు మాత్రం అంతకు ముందు నుంచే తెదేపా కాంగ్రెస్ పార్టీల గురించి ప్రజలలో తెలంగాణాకు వ్యతిరేకమైన పార్టీలన్న విషయాన్ని తీసుకెళ్ళారు కాబట్టి అటువంటి పార్టీలలోంచి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోంచి ఎక్కువగా తెరాస లోకి వచ్చిన వారికి పార్టీ టికెట్లనివ్వటాన్ని తప్పుపట్టారాయన. 

ముందు వాళ్ళు తెలంగాణా ద్రోహులైతే పార్టీ ఖండువా మారిపోగానే పునీతులైపోతారా అని ప్రశ్నించారాయన.  తెరాస వైఖరిని అప్పుడు తప్పు పట్టినా ఈరోజు సమావేశం తర్వాత అటువంటి వ్యాఖ్యానాలేమీ చెయ్యలేదు కానీ ఐకాస నియమావళిని మాత్రం త్వరలో ప్రకటిస్తామని అన్నారు కోదండరామ్.

పవన్ కళ్యాణ్ కూడా అలాగే రాజకీయాలలోకి వస్తాను కానీ అధికారాలు, పదవులు ఆశించను, కానీ అన్నీ గమనిస్తుంటాను, తప్పు చేసిన వాళ్ళ తాట తీస్తాను అని తనదైన శైలిలో అన్నారు.  అలాగే తెలంగాణా ఐకాస కూడా జూన్ 2 న ఆవిర్భవించబోతున్న తెలంగాణా రాష్ట్రంలో వాచ్ డాగ్ లా అన్నీ గమనిస్తుంటాం అని మాత్రం తెఐకాస ముఖ్యోద్దేశ్యమైతే చెప్పారు కానీ ఇంకా ఇతర అంశాలు వెల్లడవటం మిగిలివుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles