Alliance between bjp and tdp finalized

Alliance between BJP and TDP finalized, BJP Javadekar, TDP Chandrababu Naidu, TDP BJP seat adjustments

Alliance between BJP and TDP finalized

చివరకు పొత్తులు ఫైనల్, పార్టీలలో అసహనం

Posted: 04/07/2014 09:31 AM IST
Alliance between bjp and tdp finalized

కొద్దికాలంగా అనిశ్చితి తర్వాత తెలుగు దేశం పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య ఎన్నికల పొత్తులో సయోధ్య కుదిరింది.  భాజపాకి తెలంగాణాలో 8, సీమాంధ్రలో 5 పార్లమెంటు సీట్లు ఇవ్వటానికి, తెలంగాణాలో 47 అసెంబ్లీ సీట్లు, సీమాంధ్రలో 15 అసెంబ్లీ సీట్లు ఇవ్వటానికి తెదేపాతో ఒప్పందం కుదిరింది.  దీనితో తెదేపా తెలంగాణాలో 72 అసెంబ్లీ స్థానాలలోను 9 పార్లమెంటు స్థానాలలోను పోటీ చెయ్యటానికి వెసులుబాటు కలిగింది.  అలాగే సీమాంధ్రలో 160 అసెంబ్లీ స్థానలకు, 10 పార్లమెంటు స్థానాలకు పోటీ చెయ్యటానికి వెసులుబాటు కలిగింది..  ఈ విషయాన్ని ఆదివారం మధ్యాహ్నం ఇరు పార్టీలు అధికారికంగా ప్రకటించాయి. 

భాజపా తరఫునుంచి ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ జవదేకర్, తెదేపా తరఫు నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ ప్రకటనలు చేసినప్పుడు తెదేపాతో పొత్తకి వ్యతిరేకత చూపిస్తూ వస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ సింగ్ ఆ సమావేశానికి గైర్హాజరవటం విశేషం. 

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎన్డియే కి మద్దతును కూడా ప్రకటించారు.  అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ నేతృత్వంలో నడిచే యుపిఏ ప్రభుత్వం దేశాన్ని భ్రష్టుపట్టించిందని ఆయన అన్నారు.

పొత్తుల సమావేశాలు జరుగుతుండటం వలన అభ్యర్థులు, స్థానాల ప్రకటనలను మధ్యలోనే నిలిపివేసిన ఇరు పార్టీలు మరోసారి చర్చకు కూర్చుంటే కానీ పూర్తి రాదు.  ఇప్పటివరకు నిర్ణయమైన దాన్నిబట్టి ఈ క్రిందివి తెలంగాణాలో భాజపాకి కేటాయించిన సీట్లు. 

పార్లమెంటుకి- హైద్రాబాద్, సికింద్రాబాద్, మహబూబ్ నగర్, కరీం నగర్, మెదక్, భువనగిరి, వరంగల్, నిజామాబాద్.

అసెంబ్లీకి- మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, గద్వాల, నారాయణపేట లేక షాద్ నగర్, పరిగి, వికారాబాద్, తాండూరు, మల్కాజ్ గిరి, ఉప్పల్, అంబర్ పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్, మలక్ పేట, గోషా మహల్, కార్వాన్, మునుగోడు, ఆలేరు, సిద్ధపేట, రుబ్బాక, నర్సాపూర్, సంగారెడ్డి, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, జనగామ, వర్ధన్నపేట, అదిలాబాద్, నిర్మల్, చెన్నూర్, మంచిర్యాల, ముదోల్, కరీం నగర్, సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, ధర్మపురి, రామగుండం, హుస్నాబాద్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, ఆర్మూర్, పినపాక.

ఈ క్రింది స్థానాలు భాజపాకి సీమాంధ్రలో ఎన్నికల కోసం కేటాయించటం జరిగింది-

పార్లమెంటుకి- విశాఖపట్నం, అరకు, నర్సాపురం, తిరుపతి, రాజంపేట.

అసెంబ్లీకి- నరసన్నపేట, గజతినగరం, విశాఖ ఉత్తరం, పాడేరు, రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, రాజోలు, తాడేపల్లి గూడెం, కొవ్వూరు, విజయవాడ సెంట్రల్, నర్సారావు పేట, సంతనూతులపాడు, సర్వేపల్లి నెల్లూరు రూరల్, మదనపల్లి, అనంతపురం అర్బన్, కడప.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles