Chandrababu sure of winning in elections

Chandrababu sure of winning in elections, Telugu Desam party, Mandali Buddha Prasad joins TDP, Pinnamaneni Venkateswara Rao joins TDP, Congress party

Chandrababu sure of winning in elections

తెలుగుదేశం నూటికి వెయ్యి శాతం గెలిచి తీరుతుంది- చంద్రబాబు

Posted: 04/02/2014 02:19 PM IST
Chandrababu sure of winning in elections

ఈరోజు మాజీ మంత్రులు మండలి బుద్ధప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు, ఈ ఎన్నికలలో తెదేపా నూటికి వెయ్యి శాతం గెలుపు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసారు. 

తరతరాలుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకునివున్న ఈ రెండు కుటుంబాలు ఆ పార్టీని వీడి తెదేపాలోకి రావటానికి కారణం, కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతికి చేసిన ద్రోహమే నని చంద్రబాబు అన్నారు. 

సీమాంధ్రను స్వర్ణాంధ్రగా చేసే సామర్ధ్యం చంద్రబాబు నాయుడికే ఉందని, అందుకే ఆయనతో పనిచెయ్యటానికి తెలుగు దేశం పార్టీలో చేరామని అన్న పిన్నమనేని, మండలి బుద్ధప్రసాద్ సోనియాగాంధీ గురించి మాట్లాడుతూ, ఆమె తెలివతక్కువగా ప్రవర్తించారా లేక పోతే అతి తెలివి ప్రదర్శించారో అర్థం కావటం లేదని అన్నారు. 

చంద్రబాబు వోటర్లను ఉద్దేశిస్తూ, వోటర్లు ఆలోచించి వోట్లు వెయ్యాలని, వచ్చే ఐదు సంవత్సరాలు చాలా గడ్డురోజులని, కష్టపడి పనిచెయ్యవలసి వుంటుందని, లేకపోతే భవిష్యత్తు అంధకారబంధురమౌతుందని హెచ్చరించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles