Dendroid attacks android smart phones

Dendroid attacks Android smart phones, Computer Emergency Response Team of India, AndroRAT, Dendroid malware

Dendroid attacks Android smart phones

ఆండ్రాయిడ్ కి డెన్డ్రాయిడ్ బెడద

Posted: 03/27/2014 12:08 PM IST
Dendroid attacks android smart phones

ఇండియాలో ఆండ్రాయిడ్ ఫోన్లకి డెన్డ్రాయిడ్ వైరస్ నుంచి బెడద వచ్చి పడుతోంది.  కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (సిఇఆర్ టి-ఇన్) ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాం మీద పనిచేసే ఫోన్ల వినియోగదారులను హెచ్చరిస్తూ డెన్డ్రాయిడ్ అనే వైరస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల మీద దాడి చేస్తోందని తెలియజేసింది. 

ఈ వైరస్ హెచ్ టి టి పి మీద పనిచేసే రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్ (ర్యాట్) అని, ఇది పిహెచ్ పి తో చేసిన అప్లికేషన్ ప్యాకేజ్ అని, దీని వలన ఫోన్ లోని కాల్ లాగ్స్ ని డిలీట్ చెయ్యటం, వెబ్ పేజెస్ ని ఓపెన్ చెయ్యటం, ఎస్ఎమ్ఎస్ లను ఉపయోగించటం చేస్తుందని సిఇఆర్ టి-ఇన్ చెప్తోంది. 

డెన్డ్రోయిడ్ లా ఇంకా ఎన్నో వైరస్ లు ఉన్నా, ఆండ్రోయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ తో ఫైల్స్ ని క్రియేట్ చేసేది మాత్రం మొదటిసారిగా వచ్చింది ఈ ఆండ్రో ర్యాటేనని తెలుస్తోంది.  డెన్డ్రోయిడ్ గూగుల్ ప్లే స్టోర్  సెక్యూరిటీకి దొరక్కుండా ఉండేట్టుగా డిజైన్ చేసిన మాల్ వేర్ అని కూడా చెప్తున్నారు.  ఈ డెన్డ్రోయిడ్ సాకర్ అనే పేరుతో 300 డాలర్లకు అమ్ముడుపోతున్నదని సైమన్ టెక్ ఆరా తీసింది.  వాటిని బిట్ కాయినే, లైట్ కాయిన్ ల ద్వారా చెల్లించవచ్చు. 

ఇటువంటి వైరస్ దాడి నుండి రక్షించుకోవటం కోసం కేవలం విశ్వసనీయమైన అప్లికేషన్లను మాత్రమే వాడాలని సిఇఆర్ టి-ఇన్ తెలియజేస్తోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles