First women bank in the state of ap

First women bank in the state of AP, First women bank in Ameerpet, Bharatiya Mahila Bank, Usha Ananthasubramania, BMB fully owned by Govt

First women bank in the state of AP, First women bank in Ameerpet, Bharatiya Mahila Bank, Usha Ananthasubramania

రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా బ్యాంక్ అమీర్ పేటలో

Posted: 03/22/2014 11:57 AM IST
First women bank in the state of ap

ఈరోజు హైద్రాబాద్ లోని అమీర్ పేటలో రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా బ్యాంక్ శాఖ ప్రారంభమైంది.  ఉద్ఘాటనలో భారతీయ మహిళా బ్యాంక్ ఛైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉషా అనంత సుబ్రహ్మణ్య, బాలల హక్కుల కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ శాంతా సిన్హా పాల్గొన్నారు.

బ్యాంక్ లు ఎన్నో ఉన్నా, కేవలం 26 శాతం మహిళలు మాత్రమే బ్యాంక్ ఖాతాలను కలిగివున్నారని, కుటుంబాన్ని నడపటానికి మహిళలు కూడా ఆర్ధిక వ్యవహారాలలో పాలుపంచుకోవటానికి ప్రోత్సహించటమే భారతీయ మహిళా బ్యాంక్ ముఖ్యోద్దేశమని మహిళా బ్యాంక్ సిఎమ్ డి ఉష అన్నారు.

ఇందులో మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఖాతాలు తెరవవచ్చు కానీ కేవలం మహిళలకు ఋణాలు, వారి నుంచి డిపాజిట్లకే ప్రాధాన్యత ఉంటుంది.  మామూలుగా చేసే బ్యాంక్ లావాదేవీలకు మాత్రమే పరిమితం కాకుండా, మహిళలకు ఆర్ధిక స్వాతంత్రం, ముఖ్యంగా గ్రామీణ మహిళలో పొదుపుతో బ్యాంక్ లో దాచుకోవటం, ఇతర బ్యాంక్ వ్యవహారాల మీద అవగాహన పెంచటమనేది భారతీయ మహిళా బ్యాంక్ ప్రధాన లక్ష్యమని ఉష అన్నారు. 

భారతీయ మహిళా బ్యాంక్ పూర్తిగా ప్రభుత్వ బ్యాంక్, మహిళల అభివృద్ధి కోసం ఏర్పడ్డ బ్యాంక్.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles