Bjp in tough bargaining due to bjp hawa

BJP in tough bargaining due to BJP Hawa, BJP State in charge Javadekar, BJP leader Venkaiah Naidu, TDP BJP alliance, BJP demands TDP

BJP in tough bargaining due to BJP Hawa

తెదేపాతో పొత్తులలో భాజపా కచ్చితమైన బేరసారాలు

Posted: 03/21/2014 08:59 AM IST
Bjp in tough bargaining due to bjp hawa

2014 ఎన్నికల కోసం తెలంగాణా సీమాంధ్ర ప్రాంతాలలో పొత్తుల విషయంలో ఒక అభిప్రాయానికి రావటం కోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ జవదేకర్ రాక, ఇరు ప్రాంత నాయకులతో పలుమార్లు చర్చలు జరిగాయి.  ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకున్న తర్వాత బేరసారాలు జరిగాయి. 

దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి వచ్చిన ప్రాచుర్యం దృష్ట్యా భాజపా పొత్తు విషయంలో కచ్చితమైన, వెనక్కి తగ్గని బేరాలే సాగించినట్లుగా తెలుస్తోంది. 

తెలంగాణాలో ముఖ్యమంత్రి పదవితో పాటు భాజపా 9 ఎంపీ సీట్లు, 70 శాసన సభ సీట్లను కోరుతోంది.  అందుకు కారణం తెలంగాణా కోసం పాటుపడటం, దేశ వ్యాప్తంగా మోదీ కి వచ్చిన ప్రాచుర్యాలను దృష్టిలోపెట్టుకుని భాజపా బేరాలలో ఏమాత్రం తగ్గటం లేదు.  తెదేపాతో తెలంగాణాలో పొత్తుతో తెలంగాణాలో భాజపా ప్రాచుర్యం తగ్గే అవకాశం ఉంది కాబట్టి టిడిపి మీద భాజపాదే పెత్తనం ఉంటుంది. 

సీమాంధ్రలో మైదానమంతా ఖాళీయే టిడిపియే పెత్తనం చెలాయిస్తుంది.  వీటికి అంగీకరిస్తే పొత్తు, లేదంటే వద్దు అంటోంది భాజపా. అయితే సీమాంధ్రలో 7 ఎంపీ సీట్లు, 30 ఎమ్మెల్యే సీట్లు కావాలంటోంది. 

జాతీయ నాయకులతో అన్ని విషయాల మీద స్పష్టమైన నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని, అలా తీసుకున్న తర్వాత తెదేపాకు తప్పనిసరిగా వాటికి అంగీకరించవలసి వుంటుందని భాజపా నాయకులు అంటున్నారు. భాజపాకు అంగీకరయోగ్యంగా ఉంటేనే పొత్తులు లేకపోతే లేదు అంటున్నారు వెంకయ్య నాయుడు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles