Political party that sends leaders to other parties

Political party that sends leaders to other parties, Migration of leaders one party to other, Elections 2014, Migration to weaken other party

Political party that sends leaders to other parties

నాయకులను వలసలు పంపుతున్న పార్టీ?

Posted: 03/19/2014 04:48 PM IST
Political party that sends leaders to other parties

2014 ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలన్న ఆత్రుతలో వైరి శిబిరాల నుంచి వచ్చే నాయకులకు ఘన స్వాగతం పలుకుతూ పార్టీలను బలోపేతం చేసుకుంటున్న నేపథ్యంలో కొన్ని పార్టీలు కావాలనే తమ పార్టీలోని నాయకులను ఇతర పార్టీలకు వలసలు పంపుతున్నాయని నిఘావర్గాలు తెలుసుకున్న సత్యం. 

ఎన్నికల సమరానికి శక్తిని పుంజుకోవటం కోసం ఎడాపెడా నాయకులకు ఖండువాలు కప్పి స్వాగతించటమే కాకుండా వాళ్ళకోసం సీట్లను కేటాయించటానికి కూడా వెనకాడటం లేదు.  ఇలాంటి నేపథ్యంలో ఇది నిజమేనా అని ఆశ్చర్యపోయాయి నిఘా వర్గాలు.  ఎవరైనా తమ పార్టీలోంచి ఇతర పార్టీలోకి పొమ్మని పంపుతారా అని ఆశ్చర్యపోవటం వాళ్ళ వంతైంది. 

అయితే వాళ్ళకి అందుకు సమాధానం కూడా త్వరలోనే తెలిసిపోయింది.  ఎందుకంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ అనేది కొత్తేమీ కాదు.  పోలీసు శాఖలో పనిచేస్తూ నేరస్తుల ముఠాలో చేరి కూపీలు లాగటం అపాయకరమైనా ఫలితాలు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. 

అంతే కాదు, దర్యాప్తులలో ఎన్నో విషయాలు బయటపడుతుంటాయి.  అవసరం లేని వాటిని వాళ్ళు పక్కకు పెట్టేస్తారు.  అలాంటివాటిలో, ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ మేనేజ్ మెంట్ మరో పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేసే ఛీఫ్ కుక్ కి నెలనెలా జీతం ఇస్తోందని కూడా వాళ్ళ దృష్టికి వచ్చింది.  ఎందుకలా ఇస్తోంది అంటే, అక్కడ వంటకాలను పాడు చేసి ఆ హోటల్ కి చెడ్డపేరు తేవటానికట.

అలాగే పార్టీలోంచి మిగతా పార్టీలలోకి పంపించేది ఎందుకంటే ఆ పార్టీలో శల్య సారధ్యం చెయ్యటానికని అర్థమైంది నిఘా సంస్థలకి.  పనైపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఈ పార్టీ తలుపులు వాళ్ళకోసం తెరిచే వుంటాయని కూడా వాళ్ళకి హామీ ఇచ్చి పంపుతున్నారట.  అవతలి పార్టీకి నమ్మకం కలగటం కోసం ఈ పార్టీ మీద కొన్ని అభాండాలు మోపుతూ అందుకు తమ దగ్గర సాక్ష్యాధారాలున్నాయని కూడా ప్రకటిస్తుంటారు వాళ్ళు.  ఇక కార్యకర్తలైతే ఎవరికీ అనుమానం రాదు.  వాళ్ళని మరీ సులభంగా అవతలి పార్టీలో కూపీలు లాగటానికి పంపించవచ్చు.

ఈ వివరాలు తమ దృష్టికి వచ్చినా అందులో నేరం మోపటానికి ఏ సెక్షన్ కూడా లేదు కాబట్టి వాటిని పక్కకు పెట్టేస్తుంటారట నిఘా సంస్థలలోని అధికారులు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles