Fire on seshadri hill uncontrollable

Fire on Seshadri hill uncontrollable, Fire broke in Tirumal hills, Seshadri hill under fire, Thousand of hectors of Tirumal forest gutted, TTD EO Gopal, TTD JEO Srinivasa Raju

Fire on Seshadri hill uncontrollable

తిరుమల కొండల మీద అదుపులోకి రాని మంటలు

Posted: 03/19/2014 02:06 PM IST
Fire on seshadri hill uncontrollable

శేషాచలం అడవులలో వ్యాపించిన అగ్నితో ఇప్పటివరకు వెయ్యి హెక్టార్ల అడవి దగ్ధమైంది.  అందులో విద్యుత్ ఉత్పాదన కోసం ఏర్పాటు చేసిన పవన మరలు కూడా నష్టపోతున్నాయి.  అగ్ని మాపక దళాలు మంటలను ఆర్పటంలో అశక్తతను చూపిస్తున్నాయి. 

ఇప్పటికే వేల హెక్టార్ల మేరకు అటవీ సంపద దగ్ధమైంది.  మంటలు ఎగిసిపడుతుండటంతో దట్టమైన పొగలు వ్యాపించి యాత్రికులను భయభ్రాంతులను చేస్తున్నాయి.  అసలే తిరుమల నడక దారిలో అప్పుడప్పుడు చిరుత సంచారంతో భక్తులలో భయం చోటుచేసుకుంటోంది.  ఇక అడవి దగ్ధమవటంతో వన్య మృగాలు బయటపడే అవకాశం ఉంది కాబట్టి అటవీ శాఖ వారిని అప్రమత్తమై యాత్రికులకు ఇబ్బంది కలుగకుండా చూడమని ఈవో గోపాల్ కోరారు. 

హెలికాప్టర్లను ఉపయోగించి మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తామని జెయివో శ్రీనివాసరాజు తెలియజేసారు.  మంటల వలన గాలి మరలకు కలిగిన నష్టం 70 కోట్ల వరకు అంచనా వేస్తున్నారు.  విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో తిరుమలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.  పాప వినాశనం అడవికి కూడా మంటలు వ్యాపించాయి.  ప్రస్తుతం పనిచేస్తున్న 4 ఫైర్ ఇంజన్లు సరిపోక పోవటంతో పక్క జిల్లాల నుంచి ఫైర్ ఇంజన్లు, ఆంబులెన్స్ లను తెప్పిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles