Kiran kumar reddy party to be called jai samaikyandhra

Kiran kumar reddy, kiran, Jai Samaikyandhra, Jai Samaikyandhra party, Kiran names party Jai Samaikyandhra,

Kiran kumar reddy party to be called Jai Samaikyandhra, Kiran names party Jai Samaikyandhra

కిరణ్ పార్టీ పేరు ఇదే- ఆ పార్టీ డిమాండ్స్ ?

Posted: 03/10/2014 07:41 PM IST
Kiran kumar reddy party to be called jai samaikyandhra

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ  కొత్త పార్టీ పేరును ఈరోజు బయట పెట్టారు.  తమ పార్టీ  పేరును అందరినీ కలుపుకొని పోయేలా ‘జై సమైక్యాంద్ర ’ గా  పెట్టామని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. 

అయితే  కిరన్ కుమార్ రెడ్డి కొత్త పార్టీలో    కార్యవర్గం

 అధ్యక్షులు  కిరణ్ కుమార్ రెడ్డి , పార్టీ వ్యవస్థాపక అద్యక్షులు  చుండ్రు శ్రీహరిరావు, పార్టీ కార్యదర్శి జి.గంగాధర్, వ్యూహకర్త : లగడపాటి రాజగోపాల్ , పార్టీ ఉపాధ్యక్షులు, సాయిప్రతాప్, సబ్బం హరి,  ఉండవల్లి, హర్షకుమార్ , శైలజానాద్,  పితాని.

అయితే   మా పార్టీ  టిక్కెట్  కోసం ఇప్పటికే  చాలా మంది దరఖాస్తులు  చేసుకున్నారని మాజీ ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.  అయితే  పార్టీ విధానాలు,  సిద్దాంతాలు  గురించి   రాజమండ్రిలో  జరిగే సభలో  వివరిస్తామని  తెలిపారు.

రాష్ట్రంలో  అందరు కలిసుండాలనే  ఉద్యమం తెలంగాణ నుంచే వస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి  అన్నారు. తెలుగువారంతా  కలిసి మెలిసి ఉండాలనేదే  తమ పార్టీ ముఖ్య సిద్దాంతమన్నారు.  ఇబ్బందులు  వస్తే  ప్రజలు కచ్చితంగా  తిరగబడతారని తెలుసుకోవాలన్నారు.  విభజన అనేది ప్రజల  మేలుకోసమే  జరగాలని  పార్టీలు, నాయకుల కోసం  రాష్ట్రం  విభజన  జరగకూడదని  ఆయన అన్నారు.    ఈ సందర్భంలో  కిరణ్ కుమార్ రెడ్డి  బెర్లిన్  గోడ ముక్కను విలేకరులకు చూపించారు. కలిసి ఉండాలనే బలమైన కాంక్షతోనే  తూర్పు, పశ్చిమ, జర్మనీల మద్య ఉండే గోడను ప్రజలే  బద్దలుగొట్టారని ఆయన గుర్తుచేశారు. 

తెలంగాణ  వచ్చాక కూడా రాజకీయ నాయకులు  అసత్యాలే చెబుతున్నారని  మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి  ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు..

* పార్టీ సీఎంగా  ఉన్నప్పుడే  అధిష్టానం మాట వినలేదు

* తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో  కొత్త పార్టీ

* పార్టీని విభేదించే  నేను బయటకు వచ్చా.

* రాష్ట్ర విభజనకు  ముక్య కారకుడు  చంద్రబాబే

* చంద్రబాబు తన అభిప్రాయాలను  అసెంబ్లీలో  కూడా చెప్పలేకపోయారు. 

* తెలుగు ప్రజలకు  కాంగ్రెస్,  భాజపా కలిసి తీవ్ర ద్రోహం చేశాయి. 

* పార్టీలో  ఉన్నప్పుడే  కాంగ్రెస్ పెద్దల మాట వినలేదు, లేనప్పుడు ఎలా వింటా? 

* రాష్ట్ర విభజన  ప్రక్రియలో  కేంద్రప్రభుత్వం  హోమ్ వర్క్  సరిగా చేయలేదు?

* బిల్లు పార్లమెంటు లో  పెట్టిన తర్వాత రోజు  సవరణులు పెట్టారంటే  అర్థమేంటి? 

* రాష్ట్ర  విభజన వల్ల తెలంగాణ  రైతులకు  ఎంతో నష్టం  కలుగుతుందని  చెప్పా. 

* తెలంగాణ వల్ల  అందరికంటే  ఎక్కువ నష్టం మహబూబా్ నగర్ జిల్లాకే అని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles