President approves telangana bill

President approves Telangana Bill, AP State Reorganization Bill 2014, President Pranab Mukherjee, Telangana Bill approved, Telangana Appointed s

President approves Telangana Bill, AP State Reorganization Bill 2014

తెలంగాణా బిల్లు మీద రాజముద్ర

Posted: 03/02/2014 09:12 AM IST
President approves telangana bill

తెలంగాణా బిల్లు కీలకమైన పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత అంతిమంగా రాష్ట్రపతి ఆమోదంకోసం వెళ్ళింది.  ఫిబ్రవరి 18 న లోక్ సభలోను, ఫిబ్రవరి 20 న రాజ్యసభలోనూ ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు 2014 ఆ తర్వత రాష్ట్రపతి ఆమెదం కోసం పంపించబడింది.  దాని మీద మార్చి 1 న రాష్ట్రపతిచేత రాజముద్ర పడింది.  దీనితో రాష్ట్ర విభజన జరగటానికి కావలసిన అన్ని తంతులూ పూర్తయినట్లే.  ఇక కేంద్ర ప్రభుత్వం అప్పాయింటెడ్ డే ని గెజిట్ లో ప్రచురించటమే తరువాయి.  అందులో ఇచ్చిన తేదీ నుండి రాష్ట్రం విభజించబడినట్లే. 

మరో పక్క ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి పికె మొహంతీ నాయకత్వంలో రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర రాష్ట్ర సిబ్బంది పంపిణీ, ఆస్తులు అప్పుల పంపిణీ కార్యక్రమం చకచకా సాగిపోతోంది.  ఈ తతంగమంతా పూర్తవటానికి కనీసం 90 రోజులు పడుతుందని హోం శాఖ అంచనా వేస్తోంది. 

జూన్ 2 వరకు మాత్రమే శాసనసభ కాలం మిగిలివుండటంతో రాష్ట్ర విభజన జరిగినట్లుగా తెలంగాణా అప్పాయింట్ మెంట్ డే ని గెజిట్ లో ముద్రించినట్లయితే అది రాజశాసనాన్ని ప్రకటించినట్లు కూడా అవుతుంది, నూతన రాష్ట్ర ఆవిర్భావం ఆ రోజు జరిగినట్లుగా గణించటం జరుగుతుంది. 

ఇక ఎన్నికలు రెండు రాష్ట్రాలలోనా లేక ఉమ్మడి రాష్ట్రంలోనా అన్నది అప్పాయింట్ మెంట్ డే ప్రకటన మీద ఆధారపడివుంటుంది.  కాబట్టి అది రెండు రోజుల్లో తేలిపోతుంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles