11 congress leaders joining tdp

11 Congress leaders joining TDP, 3 Ministers 8 MLA join TDP, Chandra Babu Naidu, TG Venkatesh, Erasu Pratapa Reddy, Ganta Srinivasa Rao

11 Congress leaders joining TDP, 3 Ministers 8 MLA join TDP

11 మంది కాంగ్రెస్ నాయకుల చేరికతో బలం పుంజుకుంటున్న తెదేపా

Posted: 02/28/2014 09:23 AM IST
11 congress leaders joining tdp

ముగ్గురు మాజీ మంత్రులు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కలుపుకుంటూ బలోపేతం చేసుకుంటున్న తెలుగుదేశం పార్టీ వలన కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కలుగుతోందా అంటే, అది ఎప్పుడో జరిగిపోయింది, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో దూకుడు వ్యవహారంలో వెళ్ళినప్పుడే కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రను కోల్పోయిందంటున్నారు కాంగ్రెస్ నాయకులు. 

తెలుగుదేశంలో పార్టీలో చేరబోతున్న మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాసరావులు.  వీరిలో గంటా, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, గాజువాక ఎమ్మెల్య్ సి.వెంకట్రామయ్య, పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు, కాకినాడ రూరల్ ఎమ్మల్యే కన్నబాబు  మార్చి 8న విశాఖపట్నంలో జరగబోయే ప్రజాగర్జన సభలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. వీళ్ళంతా తొలుత ప్రజారాజ్యం పార్టీలో చేరి దరిమిలా కాంగ్రెస్ లోకి విలీనమైన నాయకులే. 

మంత్రులు టి.జి వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, మాజీ మంత్రి మోహన్ రెడ్డి కర్నూల్ జరగబోయే ప్రజాగర్జనలో తెదేపాలో చేరబోతున్నారు. 

కాంగ్రెస్ సీమాంధ్రకు అన్యాయం చేసిందని చెప్పటమే కాకుండా, పార్టీ మాత్రమే ముఖ్యం కాదని, దాని వెనకనుండి నడిపించే నాయకులే ముఖ్యమని, ప్రస్తుతంమున్న వారిలో చంద్రబాబు నాయుడుకున్న నాయకత్వ లక్షణాలు వేరెవరిలోనూ కనపడలేదని అన్నారు టిజి వెంకటేష్. 

నెల్లూరు జిల్లాకి చెందిన అదాల ప్రభాకరరెడ్డి, శ్రీధర కృష్ణారెడ్డి, పోలమరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరులో మార్చి 5 నజరిగే ప్రజాగర్జన సభలో తెదేపాలో చేరటానికి నిశ్చయించుకున్నారు. 

దీనితో ఎన్నికలలో పోటీచెయ్యటానికి తెదేపా శక్తి పుంజుకుంటున్నట్లుగానే కనిపిస్తోంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles