Chiru disappoints mega fans by rejecting cm post

Chiranjeevi, Chief Minister's position, AP CM Post, Chiranjeevi was offered CM’s post, Chiranjeevi rejected CM’s post

Chiru Disappoints Mega Fans By Rejecting CM Post, minister chiru rejects cm post

సిఎం పదవికి నో చెప్పిన చిరంజీవి-నిరాశలో మెగా ఫ్యాన్స్

Posted: 02/27/2014 03:51 PM IST
Chiru disappoints mega fans by rejecting cm post

కేంద్ర మంత్రి చిరంజీవి ఆంద్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రి అని మీడియాలో ప్రచారంజరుగుతుంది. కాంగ్రెస్  హైకమాండ్ పెద్దలతో  కేంద్ర మంత్రి  చిరంజీవి భేటీలతోనే ఈ  ప్రచారం  ఊపందుకుంది.  అంతేకాకుండా.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో.. చిరంజీవి ప్రత్యేకగా  భేటి  కావటంతో ఆంద్రపదేశ్ కు  చివరి సిఎం  చిరంజీవి  అని రాజకీయల్లో చర్చ జరిగింది. 

అయితే ఈ రోజు  కేంద్రంమంత్రి   చిరంజీవి మీడియాతో  మాట్లాడుతూ.. తను సీఎం పదవి  రేసులు లేనని,  సీమాంద్ర  ప్రజల మనోభావాలను   రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ  ద్రుష్టికి తీసుకెళ్లానని  చిరంజీవి అన్నారు.  అంతేకాకుండా రాష్ట్రంలో  జరుగుతున్న  రాజకీయ పరిస్థితుల గురించి కాంగ్రెస్ హైకమాండ్ తో  చర్చించటం జరిగిందని అన్నారు. 

ముఖ్యమంత్రి పదవి రేసు లో తాను లేనని మీడియా అనవసరంగా గందర గోళం చేస్తుందని చిరంజీవి  అన్నారు. ముఖ్యమంత్రి పదవిపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని  సిఎం పదవి తనకిస్తే ముందుగా మీడియాకే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. కిరణ్  కుమార్  రెడ్డి పార్టీ పై  తానేమి వ్యాఖ్యానించబోనని, ప్రజాస్వామ్యంలో ఎవరైన రాజకీయ పార్టీలు  పెట్టుకోవచ్చన్నారు.

ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్  చిరంజీవికి  సీఎం పదవి ఇస్తే,  తెలుగు  చిత్ర పరిశ్రమ నుండి రాష్ట్రానికి  ముఖ్యమంత్రి అయిన వారిలో మొదట డాక్టర్ నందమూరి తారక రామారావు పేరు ఉంది. సెకండ్  స్థానంలో చిరంజీవి పేరు ఉండేదని  ఆయన అభిమానులు అంటున్నారు.  

ఏమైన సీఎం పదవికి చిరంజీవి ఎందుకు నో  చెప్పాడు అనే విషయం రాజకీయల్లో చర్చ జరుగుతుంది.  కారణాలు ఏమైన .. చేతిలోకి వచ్చిన  సీఎం పదవిని వదులుకున్న  మొదటి తెలుగు నాయకుడు  చిరంజీవే అనే  మాటలు   కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి. 

మెగా అభిమానులు కల తీరుతున్న సమయంలో..కేంద్ర మంత్రి  చిరంజీవి ముఖ్యమంత్రి పదవిని త్రుణప్రాయంగా  వదిలేయటంతో.. మెగా అభిమానులు. తీరాని బాధకు గురైనట్లు తెలుస్తోంది.  చిరంజీవిని  ముఖ్యమంత్రిగా చూడాలనే మెగా అభిమానుల ఆశ  మళ్లీ ఎప్పుడు తీరుతుందో ..చూద్దాం. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles