Kcr lands at hyderabad after telangana bill approved

KCR lands at Hyderabad in Telangana, Telangana Rashtra Samiti, K Chandra Sekhara Rao, Harish Rao, K Keshava RAo, Eetela Rajender, KCR Tributes at Gun Park

KCR lands at Hyderabad after Telangana Bill is approved by two houses of the Parliament

కెసిఆర్ కి అడుగడుగునా నీరాజనం పలికి స్వాగతమిచ్చిన జనం

Posted: 02/27/2014 07:52 AM IST
Kcr lands at hyderabad after telangana bill approved

25 రోజుల తర్వాత తెలంగాణా సాధించుకుని ఢిల్లీ నుంచి వచ్చిన కెసిఆర్ కి బేగంపేట నుంచి గన్ పార్క్ వరకూ జనం నీరాజనాలిచ్చారు. 

బుధవారం రాత్రి 9.00 గంటల ప్రాంతంలో అతి కోలాహలంగా బాణా సంచాలు, డ్యాన్స్ లు, గీతాలు, బతుకమ్మలు, బోనాలు, పోతురాజులు, విచిత్ర వేషధారులు ముందు నడవగా ప్రత్యేకంగా తయారుచేసిన విజయోత్సవ రథం మీద కెసిఆర్ గన్ పార్క్ వరకు వెళ్ళారు.  బేగం పేట చేరుతూనే కెసిఆర్ కి వెయ్యిమంది బ్రాహ్మణులు పూర్ణకుంభంతో కెసిఆర్ కి ఘనస్వాగతం పలికారు.  వివిధ మతాచార్యులు ప్రార్ధనలు జరిపారు.

బేగం పేట నుంచి మధ్యాహ్నం 2.00 గంటలకు ప్రారంభం కావలసిన ర్యాలీ ఢిల్లీ నుంచి కెసిఆర్ ప్రయాణం చేసిన విమానం ఆలస్యంగా బయలుదేరటంతో శంషాబాద్ విమానాశ్రయానికి 4.15 కి చేరుకున్న కెసిఆర్ అక్కడి నుండి బేగం పేటకు హెలికాప్టర్ లో వెళ్ళి, ర్యాలీలో పాల్గొన్నారు.  గుర్రాలు, ఒంటెలు కూడా ఊరేగింపులో పాల్గొన్నాయి. 

గన్ పార్క్ లో కెసిఆర్ తెలంగాణా సాధన కోసం బలిదానమిచ్చిన అమరవీరులకు నివాళులర్పించారు.  అమర వీరుల కుటుంబీకులను పరామర్శించారు.  ఆయనతో పాటు తెరాస పార్టీ ఛీఫ్ సెక్రటరీ కె కేశవరావు, సీనియర్ నేత హరీష్ రావు, మందా జగన్నాధం, వివేక్, ఈటెల రాజేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  గన్ పార్క్ కి ముందుగానే వెళ్ళిన హరీష్ రావు, కెటిఆర్, ఈటెల తదితరులు అక్కడ అమరవీరుల  కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ర్యాలీతో పాటు వచ్చినవారే కాకుండా సోమాజీ గూడా, పంజాగుట్ట, ఖైరతాబాద్ సెంటర్లలో గన్ పార్క్ దగ్గర ఎదురు చూస్తున్న కార్యకర్తలు, అభిమానులు కెసిఆర్ కి స్వాగతం పలికారు.  ర్యాలీలో తెలంగాణా గీతాలను ఆలపించారు.  నాలుగు గంటల పాటు సాగిన విజయోత్సాహ ఊరేగింపులో బేగంపేట నుంచి గన్ పార్క్ వరకు హైద్రాబాద్ గులాబి రంగు పులుముకుని తెలంగాణా దళపతి కెసిఆర్ స్వాగత కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.  
అమరులకు నివాళులర్పిస్తున్న సమయంలో పైన హెలికాప్టర్ నుంచి గులాబీ పుష్పలు కురిపించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles