Telangana appointed day soon

Telangana appointed day soon, AP Chief Secretary PK Mohanty, Election in two regions of AP separately, Division of Employees, assets and liabilities, Telangana Bill passed, Election Commission of India

Telangana appointed day announcement expected soon

తెలంగాణా ఆవిర్భావం త్వరలో!

Posted: 02/25/2014 12:26 PM IST
Telangana appointed day soon

హోంశాఖ ఆంధ్ర ప్రదేశ్ ఛీఫ్ సెక్రటరీ పి.కె.మొహంతిని ఢిల్లీకి బుధవారం రమ్మని పిలవటంతో తెలంగాణా ఆవిర్భావం త్వరలోనే అవుతుందన్న సంకేతాలు వస్తున్నాయి.  రాష్ట్రపతి దగ్గర్నుంచి రాష్ట్ర విభజన బిల్లు ఇంకా రాకపోయినా కేంద్ర ప్రభుత్వం తన ఏర్పాట్లను తాను చేసుకుంటోంది.  ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం లేనిదే సమయం.  అందువలన అన్ని ఏర్పాట్లనూ ముందుగానే చేసుకుంటేనే పని సక్రమంగా సాగుతుంది కాబట్టి తయారీలు జరుగుతున్నాయి. 

రెండు రాష్ట్ర ప్రభుత్వాలను నడపటం, భద్రతా వ్యవహారాలలో పికె మొహంతి తన నివేదికను అందించనున్నారు.  దానితో పాటుగా ఎన్నికలను ఒకవేళ రెండు రాష్ట్రాలలో నిర్వహించవలసివస్తే ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నారన్నది కూడా హోంశాఖకు తెలియజేయనున్నారు.

ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటించే లోపులోనే ఈ నిర్ణయాన్ని తీసుకోవటం ముఖ్యం కాబట్టి అన్నివిధాలా తయారీలు జరుగుతున్నాయి.  తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ఎన్నికలు ఆంధ్రా తెలంగాణాలలో విడివిడిగా జరగాలని పట్టుబడుతున్నారు.  కానీ రెండు రాష్ట్రాలుగా విభజించటానికి కనీసం మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.  అందువలన రాష్ట్రంలో లోక్ సభకు, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించకపోవచ్చు.  అలా శాసన సభ కాలాన్ని పొడిగించాలీ అంటే రాష్ట్రపతి పాలన విధించవలసిన అవసరం కలగవచ్చు. 

జివోఎమ్ సభ్యుడు జైరాం రమేష్ ఇప్పటికే రెండు ప్రాంతాల ఐఏఎస్ లతో భేటీ అవుతున్నారు. 

రాష్ట్ర విభజనలో అతి పెద్ద పనులు- ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 84000 ఉద్యోగులను ఇరు ప్రాంతాలకూ కేటాయించటం, రాష్ట్ర ఆస్తులు అప్పులను ఇరు ప్రాంతాలకూ జనభా లెక్కల ప్రకారం విభజించటం లాంటివి ఎంత త్వరగా చేద్దామనుకున్నా సమయం పడుతుంది.  ఇక రాజధాని విషయంలో నిర్ణయం, నిధుల కేటాయింపులు ఎలాగూ ఉన్నాయి.  

అసలు పని ఇప్పుడే ఉంటుంది కాబట్టి ఇతర సమస్యలు తలెత్తకుండా ఆ పనులను పూర్తి చెయ్యాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగానికి ఈ మూడునెలలూ చేతినిండా పని ఉంటుంది.  అందువలన తెలంగాణా ఆవిర్భావ దినాన్ని ప్రకటించటానికి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఇంకా ఎక్కువ సమయం లేదు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles