Kiran kumar reddy announces resignation

kiran kumar reddy announces resignation, Telangana bill, Undemocratic bill presentation, T bill passed in loksabha

kiran kumar reddy announces resignation, Telangana bill

కిరణ్ కుమార్ రాజీనామా

Posted: 02/19/2014 11:26 AM IST
Kiran kumar reddy announces resignation

తెలుగువాళ్ళకి న్యాయం చెయ్యలేకపోయినందుకు రాజీనామా చేసానంటూ ఈ రోజు మీడియా సమావేశంలో ప్రకటించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనీ రాజీనామాను ఎంతో బాధతో చేస్తున్నానని అన్నారు.

మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు జవాబుగా నేను, నా తోపాటు ఇతర నాయకులు అందరం ఒకే అంశం మీద పోటీ చేసామని, తన రాజకీయ భవిష్యత్తే ముఖ్యమనుకుంటే కాంగ్రెస్ లోనే కొనసాగేవాడినని, అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడిని కానని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.  

తాను తెలంగాణా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకిని కానని, కేవలం తెలుగు ప్రజలకు విభజన వలన రాబోయే నష్టాన్ని దృష్టిలో పెట్టుకునే వ్యతిరేకించాను తప్ప మరేమీ కాదని, ఆ పనిలో ఎవరి మనసునైనా నొప్పించివుంటే హృదయపూర్వకంగా క్షమించమని అడుగుతున్నానని అన్నారు.

ఒకవేళ అధిష్టానం కోరితే కొనసాగుతారా అన్న ప్రశ్నకు, ఎంతమాత్రం కొనసాగే ప్రశ్న లేదని, వీలయినంత త్వరగా ప్రత్యామ్నాయాన్ని చూసుకోమని ప్రభుత్వానికి చెప్తున్నానని కిరణ్ కుమార్ అన్నారు. 

కేంద్ర ప్రభుత్వ విధానాలలో కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించినవి ప్రధానంగా ఇవి-

1. శాసన సభకు పంపించిన బిల్లు డ్రాఫ్ట్ బిల్లు అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ బిల్లును యథాతథంగా రాష్ట్రపతికి పంపించటం, దాన్ని లోక్ సభలో ప్రవేశపెట్టటం సమంజసం కాదు.

2. శాసన సభ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ఎలా ప్రవేశపెడతారు

3. ఏ బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారో వాళ్ళని సిగ్గుపడే విధంగా పైకి చెప్పుకోలేని విధంగా పార్లమెంటులోనే కొట్టించటం

4. బిల్లు ద్వారా నష్టపోతున్నామని చెప్పినవాళ్ళనే సస్పెండ్ చెయ్యటం.

5. ఆందోళన చేస్తున్నవారి మాటలు విని వారికి నచ్చచెప్పాల్సింది పోయి వాళ్ళ మీదనే చర్య తీసుకోవంటం

6. దొంగల్లాగా లోక్ సభలో ప్రత్యక్ష ప్రసారాలను నిలిపి వేసి బిల్లును పాస్ చెయ్యటం.

ఎంతో మంది త్యాగఫలితంగా ఏర్పడ్డ రాష్ట్రమిది.  దాన్ని ముక్కలు చేస్తున్నప్పుడు కలిగే బాధతో పార్లమెంట్ లో స్పీకర్ వెల్ లోకి వెళ్తే ప్రధాన మంత్రికి బాధ కలిగించిందట.  మరి వీళ్ళ బాధలు బాధలు కావా అని అడిగారు కిరణ్ కుమార్.  ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కేంద్ర ప్రభుత్వంతో ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ కూడా కలిసిపోవటం మరింత దారుణమని కూడా ఆయన అన్నారు.

1962 నుంచి తన కుటుంబం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఎన్నికలలోనూ పోటీ చేసిందని, తనకి ఈ హోదాని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తాను కృతజ్ఞతా భావంతో ఉంటాను కానీ తెలుగు ప్రజలకు జరుగుతున్న తీవ్ర నష్టాన్ని విస్మరించలేకపోయానని కిరణ్ కుమార్ అన్నారు.  రాజీనామా చెయ్యటానికి తీసుకున్న నిర్ణయం అంత సులువైనదేమీ కాదని తెలుగు ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని అడ్డుకోలేకపోయానే అన్న బాధతోనే రాజీనామా చేస్తున్నానని కిరణ్ కుమార్ అన్నారు. 

జరిగిన పరిణామాల దృష్ట్యా ఇటు తెలంగాణా ప్రాంతంలోనూ అటు సీమాంధ్ర ప్రాంతంలోను నాయకులంతా పదవులకోసం నక్కల్లా ఎదురు చూస్తుంటే, కేవలం రాష్ట్ర ప్రజలకు మేలు చెయ్యాలనే సంకల్పంతో మొదటి నుంచీ ఒకే విషయాన్ని విశ్వసిస్తూ, ఒకే మాట మీద నిలబడి, ఒకే లక్ష్యంతో పోరు చేసి, అప్రజాస్వామ్య పద్ధతిలో దొడ్డిదారిన రాష్ట్ర విభజన బిల్లును ఆమోదింపజేయటం వలన ఓడిపోయినందుకు బాధపడుతూ పదవిని త్యాగం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఇతర రాజకీయ నాయకులకంటే ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. 

రాజకీయరంగంలో ప్రస్తుతం నాయకులు అనుసరిస్తున్న విధానంలో ఎదగాలంటే బహుశా కిరణ్ కుమార్ రెడ్డి నేర్చుకోవలసింది చాలా ఉందేమో!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles