ఇతివృత్తం ఏదైనా అందులో శృంగారం పాలు ఎక్కువగా ఉంటే సహజంగా ఉన్నట్లుగా చెప్పుకుంటారు చాలా మంది రచయితలు. ఎందుకంటే అది జీవితంలో విడదీయలేని భాగం కాబట్టి. నిజమే కానీ జీవితమంతా శృంగారమే కాదు కదా. మనం చేసే ఎన్నో పనులలో శృంగారం ఒకటి అంతే. కానీ రచనలలో సినిమాలలో పాఠకులకు ప్రేక్షకులకు మనసు రంజింపజేయటం కోసం శృంగారానికి ఎక్కువ ప్రాధాన్యత నిస్తుంటారు- అవసరమైనదానికంటే ఎక్కువ, దానికి అర్హత ఉన్నదానికంటే చాలా ఎక్కువ.
ఒకప్పుడు సినిమాలలో చుంబనాలు సంకేతాత్మకంగా ఉండేవి. చెట్టుచాటుకి పోయి మూతి తుడుచుకుంటూ బయటకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు సెన్సిటివ్ హెచ్ డి కేమెరాలతో క్లోజప్ లో చూపిస్తున్నారు. పోరాటాలలో కత్తులతో పొడుచుకునేదాన్ని చూపించేవారు కాదు. ఇప్పుడు చాలా స్పష్టంగా చూపిస్తున్నారు. రక్తం ఎంత చిందిస్తే అంత బాగా పోరాట సన్నివేశాలను చిత్రీకరించినట్లు. కత్తి ఒకవైపు పొడిస్తే మరోవైపు వచ్చినట్లు, చెయ్యి విరిస్తే విరిగిపోయినట్లు, తెగనరికితే కిందపడిపోయినట్లు చూపిస్తున్నారు.
సహజత్వానికి ఇంకా పాటుపడుతున్నారు మూత్రశాలలను చూపిస్తున్నారు. అందులో కూడా ఫైట్ సీన్ లు ఉంటాయి. టోరంటోలో తెలుగు భాషా ప్రేమికుల సంఘం తెలుగు వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన నెలనెలా తెలుగు సాహిత్యం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తను రచించిన ద్రైపది నవల గురించి చర్చించారు. అందులో ద్రౌపదిని వ్యభిచారిణి లా చిత్రీకరించారని వచ్చిన విమర్శలు సరికావని ఆయన చెప్పారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత నెలకొన్న వాతావరణం, భర్తలను ఆనందపరచటానికి ద్రౌపది తనను తాను అర్పించుకున్న వైనం వివరణాత్మకంగా రచించానే కానీ ఆమెను వ్యభిచారిణిలా చూపించలేదని యార్లగడ్డ అన్నారు.
అయితే అసలు మహాభారతంలోని ఆ ఘట్టాన్ని తీసుకున్నప్పుడు వివరించవలసినవి ఎన్నో ఉన్నాయి. భార్యాభర్తలు చేరువయ్యే సన్నివేశాలు తప్ప మరొకటి ఉండదా చెప్పుకోవటానికి. దాని ద్వారా ఏం సందేశమిస్తారెవరైనా. కురుక్షేత్రం తర్వాత మానసికంగా వ్యధలో ఉన్న భర్తల మనసుని రంజింపజేయటానికి భార్య చేసేది త్యాగం అనిపించుకోదు. సాధారణ జీవితంలో కూడా భర్త అలసిపోయి వస్తే సేదతీర్చటానికి భార్య, కుటుంబకలహాలో మరే ఇతర విషయాల వలనో కలత చెందిన భార్యను భర్త ఉపశమనం కలిగేలా ప్రవర్తించటం త్యాగనిరతిలోకి రాదు. అది వైవాహిక బంధంలో చెయ్యవలసిన పని.
సినిమాలలో కూడా విలన్ల దగ్గర ఐటమ్ సాంగ్స్ ని చిత్రీకరిస్తున్నారు. అది ఆ విలన్లకు స్వాంతన కలిగించటానికంటే సినిమా చూస్తున్న ప్రేక్షకులలో అంతవరకు కలిగిన భావోద్రేకాలను కాస్త చల్లబరచటానికి, ఆ తర్వాత సన్నివేశంలో రాబోయే మరో పెద్ద హింసా కాండకు ముందుగా సంసిద్ధతను పెంచటానికే.
సినిమాలలో స్రిప్ట్ కి న్యాయం చెయ్యటం కోసం ఎటువంటి సన్నివేశాలలో నైనా నటించటానికి సిద్ధమౌతున్నారు నటీనటులు. అయితే అసలు అటువంటి స్క్రిప్ట్ తయారు
చెయ్యటమెందుకసలు అని ప్రశ్నించరు. ఆఁ.... ఒకవేళ తమ పాత్ర ప్రేక్షకులను మెప్పించేట్టుగా లేదనో లేకపోతే తన ఇమేజ్ కి భిన్నంగా ఉంది కాబట్టి ప్రేక్షకులు ఆదరించరనో అనుకుంటే మాత్రం ఆ సన్నివేశాలను మార్పించేస్తారు నాయకీ నాయకులు.
శృంగారం చూపించటానికి, శృంగార భావనలు రేకెత్తించి పాఠకుల, ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా పొంది సొమ్ము చేసుకోవటానికి పనికివస్తుందే తప్ప సహజత్వం అనేది కాదు అది. ఆకలిని పెంచే అవసరం లేదు మనిషికి ఆకలి వేస్తుంది. దాహం దానంతటదే అవుతుంది. అలాగే యుక్తవయసు వచ్చిన తర్వాత శృంగార భావన దానంతటదే కలుగుతుంది కాబట్టి వాటిని పెంచవలసిన అవసరం లేదు- దాని ద్వారా ఆర్ధిక లాభాన్ని పొందాలనుకుంటే తప్ప.
పెంచాలనుకుంటే సమాజంలో పెంచవలసినవి చాలా ఉన్నాయి. అవి, మానవత్వం, సాటివారిని గౌరవించటం, త్యాగం, సర్వమానవ ప్రేమ, దేశభక్తి, వీటన్నిటితోపాటు ఆధ్యాత్మిక చింతన. వీటిని పెంచితే సమాజంలో అభివృద్ధిని చూడవచ్చు. మన సమాజం, మనం సంచరించే సమాజం, మన పిల్లలు, కుటుంబ సభ్యులు స్పేచ్ఛగా నిర్భయంగా తిరగవలసిన సమాజం. అందులో హింస, విచ్చలవిడి శృంగారాలకు తావు లేదు. పెద్దలను ఎదిరించటం కోసమే ప్రేమలో పడవలసిన అవసరం లేదు.
అందువలన ఇప్పటికైనా వ్యాపారం కోసం చేసినా మనుషులకు అవసరమైనవాటినే అందించాలి కనుక పుస్తక రచనలలో కానీ సినిమాలు టివిలలో కానీ సమాజాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తమ సృజనాత్మకతను ఉపయోగించాలి కాని, సమాజాన్ని దిగజార్చేవిధంగా కాదు. సెన్సార్ చేసిన సినిమాలు కూడా సెన్సేషనల్ గా మారటం జరుగుతోంది.
నైతికతను పెంచటానికి సత్యహరిశ్చంద్రలాంటి వంద సినిమాలు రామాయణంలాంటి వంద సినిమాలు కలిసి కూడా చెయ్యలేని పని, హింసను ప్రబోధించటానికి ఒక రామ్ లీలా సినిమా చేసేస్తుంది. ఎందుకంటే వ్యతిరేక భావనలకు శక్తి ఎక్కువ.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more