Tdp prajagarjana at tadepalligudem

TDP Prajagarjana at Tadepalligudem, Chandra Babu Naidu,Adala Prabhakara Reddy joins TDP, Congress MLA joins TDP

TDP Prajagarjana at Tadepalligudem,Chanda Babu Naidu

తాడేపల్లి గూడెంలో తెదేపా ప్రజాగర్జన

Posted: 02/15/2014 07:52 AM IST
Tdp prajagarjana at tadepalligudem

జాతీయ నాయకులను కలవటం, జాతీయ స్థాయిలో మంతనాలు జరపటం చేసిన తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇక రాష్ట్రం మీద దృష్టి సారిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ప్రజాగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 
ఈ కార్యక్రమంలో ఆది ప్రరాపా కాంగ్రెస్ చెందిన కొత్త పేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెదేపాలో చేరుతారు.  నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే అదాల ప్రభాకరరెడ్డి కూడా త్వరలోనే తెదేపాలో చేరుతారని సమాచారం. 
తాడేపల్లి గూడెంలో కార్యక్రమం పూర్తి చేసుకోగానే చంద్రబాబు నాయుడు తిరిగి జాతీయ కార్యక్రమాల్లో పాల్గొంటారు.  అందులో భాగంగా ముందుగా పంజాబ్ లో రైతు సదస్సు లో పాల్గొంటారు. 
ఈరోజు ఉదయం విజయవాడ చేరుకున్న చంద్రబాబు నాయుడు రోడ్డు మార్గంలో తాడేపల్లి చేరుకుంటారు.  ఈ ప్రజా గర్జనలో ప్రధానం దేశంలోని అవినీతి, రాజకీయలలోని కుళ్ళుని బయటపెట్టి ప్రజలను చైతన్యవంతంగా చెయ్యటమే ముఖ్యోద్దేశ్యమని తెదేపా నాయకులు తెలియజేసారు.  ఇలాంటి కార్యక్రమాలను ఇంకా అన్ని జిల్లాలలోనూ నిర్వహించాలని తెదేపా భావిస్తోంది. 
-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles