Guidelines needed for state bifurcations says mp kavuri

Guidelines for state bifurcations, MP Kavuri Sambasiva Rao, State Reorganization bill 2013, UP State division, Telangana Bill

Guidelines needed for state bifurcations says MP Kavuri

రాష్ట్ర విభజనకు మార్గదర్శకాలు- కావూరి కోరిక!

Posted: 02/14/2014 03:43 PM IST
Guidelines needed for state bifurcations says mp kavuri

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చెయ్యమని కోరితే కాదని కొట్టిపారేస్తారూ, అదే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ విభజన వద్దంటే కాదు చేస్తామని అంటారా అంటూ ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు కేంద్ర ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. 

సీమాంధ్ర ఎంపీలంతా ఢిల్లీలో కావూరి సాంబశివరావు నివాసంలో సమావేశమై నిన్నటి పార్లమెంటు పరిణామాల మీద చర్చించుకున్నారు.  ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రానికే కాక దేశం మొత్తానికే నష్టం ఏర్పడుతుందని అన్నారు.  రాష్ట్రాలను విభజించటానికి మార్గదర్శకాలుండాలని అభిప్రాయపడ్డారు.  విభజనకు కేంద్రం కట్టుబడివుంది అని అనటం సరికాదని, పార్టీ ప్రయోజనాలు కాకుండా ప్రజల సంక్షేమంలో నిర్ణయాలు తీసుకోవలసివుంటుందని కావూరి అన్నారు. 

జీవోఎమ్ లో ఏ ప్రతిపాదన తెచ్చినా దాన్ని తెలంగాణా అంగీకరించటంలేదని చెప్తూ వచ్చారు.  మరి మేము మాత్రం అన్నిటికీ ఒప్పుకోవాలా అని ప్రశ్నించారు కావూరి. 

లోక్ సభలో నిన్న జరిగిన పరిణామాలు మంచివి కావని అలా జరిగుండకుండా ఉండాల్సిందని, అయినా తప్పని పరిస్థితులలో ఎంపీలు అలా చెయ్యవలసివచ్చిందని అన్న కావూరి, అటుంవంటి గందరగోళంలో బిల్లుని ప్రవేశపెట్టామని చెప్తున్నారని, దాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles