Mass resignations may follow introduction of t bill

Mass resignations may follow introduction of T Bill, Kiran Kumar Reddy, 60 MLAs to resign, Seemandhra MPs to resign, Kiran Kumar Reddy ready to resign

Mass resignations may follow introduction of T Bill

ఊకుమ్మడి రాజీనామాలకు వేదిక సిద్ధం

Posted: 02/12/2014 10:38 AM IST
Mass resignations may follow introduction of t bill

రాష్ట్ర విభజన బిల్లు యథాతథంగా పార్లమెంటులో ప్రవేశపెట్టినట్లయితే ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగుతానని కిరణ్ కుమార్ ప్రకటించివున్నారు కాబట్టి అందుకు ముహూర్తాన్ని కేంద్ర ప్రభుత్వం రేపటికి పెట్టనే పెట్టింది.  ఎందుకంటే బిల్లు లోక్ సభలోనే ప్రవేశపెట్టటానికి, గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆ పని చెయ్యటానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. 

అందులో సవరణలు కూడా లేకుండా యథాతథంగా ప్రవేశపెడుతూ సవరణలను అధికార పక్షం తరఫునుంచి ప్రతిపాదించబోతోంది.  అందువలన కిరణ్ కుమార్ రెడ్డి తను అన్న మాట ప్రకారం రేపు రాజీనామాను సమర్పించవలసి ఉంటుంది. 

ఆయనతో పాటు విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టగానే 60 మంది ఎమ్మెల్యేలు, బహిష్కరించగా మిగిలిన ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఊకుమ్మడిగా రాజీనామా చెయ్యనున్నారు. 

చివరకు ఏం జరుగుతుందో తెలియదు వేచి చూడవలసిందే.  కానీ ఢిల్లీలో అన్ని పార్టీలలోనూ ఉత్కంఠ హెచ్చు స్థాయిలోనే కనపడుతోంది.  అందుకే పరిస్థితి మరీ విషమించకముందే పనులు చక్కబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles