Microsoft likely make nadella its ceo

Microsoft likely make Nadella its CEO, Nadella Satya, Cloud Guru Nadella Satya, Bill Gates, Microsoft 3rd CEO Nadella

Microsoft likely make Nadella its CEO, Nadella Satya, Cloud Guru Nadella

మైక్రోసాఫ్ట్ పగ్గాలు హైద్రాబాదీ చేతికి!

Posted: 01/31/2014 03:31 PM IST
Microsoft likely make nadella its ceo

బిల్ గేట్స్ స్థాపించిన మైక్రోసాఫ్ట్ కంపనీలో ఆగస్ట్ 2013 లో సిఇఓ గా పని చేసే స్టీవ్ బాల్మర్ రాజీనామా చేసిన దగ్గర్నుంచి ఆ సంస్థ ఆ స్థానాన్ని పూరించటానికి యోగ్యులైనవారికోసం చూస్తోంది.  

సిఇవో కాగలవారి జాబితాలో అందరికంటే పై స్థానంలోనున్న 47 సంవత్సరాల సత్య నాదెళ్ళ హైద్రాబాద్ లో జన్మించినవారు.  ఆయన ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ లో క్లౌడ్, ఎంటర్ ప్రైజ్ గ్రూప్ కి ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు.  ఆయన తను పనిచేస్తున్న సంస్థను బాగా అభివృద్ధి చేసారు.

బేగంపేట హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివిన నాదెళ్ల మణిపాల్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ చేసారు.  ఆ తర్వాత విస్కోన్సిన్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ లో ఎమ్ఎస్, చికాగో విశ్వవిద్యాలయంలో ఎమ్ బి ఏ చేసారు.  సన్ సంస్థలో పనిచేసిన నాదెళ్ళ 1992 లో మైక్రోసాఫ్ట్ లో చేరి, క్లౌడ్ వేదిక మీద అజూర్ సేవలను అభివృద్ధి పరచారు.  

నాదెళ్ల చేపట్టిన క్లౌడ్ సర్వీస్ ప్రతి సంవత్సరం 107 శాతం ఎదుగలను రికార్డ్ చేసింది.  దానితో ఆయనకు క్లౌడి గురు అన్న పేరు వచ్చింది.  

నాదెళ్ల ఎన్నికైనట్లయితే మైక్రోసాఫ్ట్ కి బిల్ గేట్స్, బాల్మర్ తర్వాత మూడవ సిఇవో అవుతారు.  

మైక్రో సాఫ్ట్ క్లౌడ్, మొబైల్ టెక్ లో ఎదుర్కుంటున్న సమస్యలను నాదెళ్ళ వలన అధిగమిస్తుందని సంస్థ పెట్టుబడిదారులు ఆశించటం గమనార్హం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles