7 private buses caught fire

7 private buses caught fire, Murali Krishna travels, Warangal bus fire accident, Murali Krishna Travels buses charred in fire

7 private buses caught fire

ఏడు ప్రైవేట్ బస్సులు దగ్ధం- ప్రాణనష్టం లేదు

Posted: 01/30/2014 08:51 AM IST
7 private buses caught fire

వరంగల్ నయీంనగర్ లో పెద్దమ్మ గడ్డ దగ్గర మురళీ కృష్ణ ట్రావెల్స్ కి చెందిన ఏడు బస్సులు ఈ రోజు ఉదయం మంటలలో దగ్ధమయ్యాయి.

మురళీ కృష్ణ ట్రావెల్స్ బస్సులను ఐదు రోజులుగా తన సొంత స్థలంలో నిలిపి ఉంచారు బస్సుల యజమాని లక్కం శ్రీధర్.  ప్రమాదం ఎలా జరిగిందన్నది ఇంక తెలియలేదు కాని, ఒక బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు మిగతా బస్సులకు కూడా అంటుకుని విషయం తెలిసి అగ్నిమాపక దళం ఘటనా స్థలికి చేరుకునేసరికే అన్ని బస్సులూ తగలబడిపోయాయి. 

పోలీసులు కేసు నమోదు చేసి మంటలంటుకోవటానికి కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles