Life expectancy increasing steadily

Life expectancy increasing steadily, Union Health Ministry, Union Welfare Ministry, Statistics of Health Ministry

Life expectancy increasing steadily says union Health and Welfare Ministry statistics

సాధారణ మానవ జీవిత కాల దీర్ఘంలో 5 సంవత్సరాలు వృద్ధి

Posted: 01/29/2014 09:18 AM IST
Life expectancy increasing steadily

ఒకప్పుడు 100 సంవత్సరాలు అవలీలగా బ్రతికిన మనిషి జీవితం రాను రాను చిక్కిపోతూ వచ్చింది.  ఇప్పుడు మళ్ళీ పెరిగే దిశవైపు తిరిగిందని గణాంకాలు చెప్తున్నాయి.

గత రెండు సంవత్సరాల కాలంలో జన్మించిన శిశువు అంతకు ముందు దశకంలో పుట్టిన బిడ్డకంటే 5 సంవత్సరాలు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది.  2001-2005 మధ్య జన్మించిన మగవాళ్ళు 62.3 సంవత్సరాలు ఆడవాళ్ళు 63.9 సంవత్సరాలు సగటున జీవించగా, 2011-2015 మధ్యకాలంలో జన్మించినవాళ్ళలో మగవాళ్ళు 67.3 సంవత్సరాలు, ఆడవాళ్ళు 69.6 సంవత్సరాలు జీవించే అవకాశముందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలియజేస్తున్నాయి. 

1960 లో జీవనకాలం సగటున 42 సంవత్సరాలుండగా, అది 1980 లో 48 సంవత్సరాలకు, 1990 లో 58.5 కి, 2000 లో 62 సంవత్సరాలకు వృద్ధి చెందింది. 

దేశవ్యాప్తంగా మానవ ఆరోగ్య ప్రమాణాలలో చక్కని అభివృద్ధి కలిగిందని చెప్పిన ఆరోగ్య శాఖ చెప్పిన లెక్కల ప్రకారం, ప్రకారం శిశు మరణాలు 2005 లో ప్రతి 1000 మంది శిశువులలో 58 ఉండగా అది 2012 లో 42 కి తగ్గింది.  మరింత అభివృద్ధి చెంది, 2001-2003 మధ్య శిశు మరణాలు లక్ష మందిలో 301 ఉండగా, 2007-2009 మధ్య 212 కి తగ్గిపోయాయి.

ఈ అభివృద్ధికి కారణాలలో ఒకటి మనుషులు తీసుకునే ఆహారపు విలువలు పెరగటం, దేశంలో కరువుకాటకాలు పోయి నిరంతర ఆహార ధాన్యాల సరఫరా ఉండటం అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

ఇక ఈ మానవ సగటు జీవిత ప్రమాణాన్ని 70 వరకు తీసుకెళ్ళటంలో అసలైన చాలెంజ్ ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.  పరిశుభ్రమైన త్రాగు నీరు, రోగ నివారణలు ఆరోగ్యంలో మరింత అభివృద్ధికి దోహదం చేస్తాయి.  శిశువుగా ఉన్నప్పుడు వాళ్ళకి అందే సమతౌల్యమైన పోషక పదార్థాల ప్రభావం వాళ్ళకి జీవితాంతం ఉంటుంది.  ప్రాణాంతకమైన వ్యాధుల నుండి రక్షించటానికి వాడే టీకాలు మొదలైన నివారణోపాయాలు వాటికి తోడుగా నిలుస్తాయి. 

అయితే ఎంత కాలం బ్రతికామన్నది కాదు ఎలా బ్రతికామన్నది ముఖ్యమన్నట్లు, ఔషధాలు, వైద్యోపచారాలలో కలిగిన అభివృద్ధి వలన లెక్కల ప్రకారం జీవితకాల దీర్ఘం పెరగటం సత్యమైనా, ఎంత ఆరోగ్యంగా జీవించారన్నది కూడా ముఖ్యమే.  వైద్య ప్రమాణాల ప్రకారం గుండె ఆడుతూ నాడి కొటుకుంటున్నంత కాలం జీవించినట్లుగా లెక్కింపబడ్డా, కడవరకూ ఎంత ఆరోగ్యంగా జీవించారన్నది కూడా పరిశీలించవలసిన విషయం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles